కుటుంబంతో విహరయాత్రకు వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు..

కుటుంబంతో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడికి వెళ్లాలో తోచడంలేదా? ఎక్కడికి వెళ్తే కుటుంబంతో హాయిగా గడిపేందుకు వీలుంటుంది.. సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నారా ? అయితే మీరు ఏమాత్రం సంకోచించకుండా ఈప్రదేశాలను చూసేయండి. విహారయాత్రకు ప్లాన్ చేసి.. కుటుంబంతో హాయిగా గడపండి.
1. కేరళలోని మరారికులం బీచ్ :
భారతదేశంలో ఉన్న అత్యుత్తమ బీచ్ లలో ఒకటి మరారికులం బీచ్. కేరళలోని అలెప్పీ జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామం మరారికులం. ఇది సుందరమైన సముద్రతీర గ్రామం. మీ కుటుంబంతో విహారయాత్ర కోసం వెళ్లేందుకు బెస్ట్ అండ్ ఫస్ట్ చాయిస్ మరారికులం బీచ్ . ఈబీచ్ మిమ్మల్ని ఖచ్చితంగా నిరాశపరచదు అనడంలో సందేహం లేదు. బీచ్ చుట్టూ నడిచేందుకు వీలుంటుంది. అక్కడి వాటర్ సోర్స్ అస్వాదిస్తూ సమయాన్ని గడపొచ్చు. బీచ్ సాయంత్ర వేళల్లో ఆటస్థలాన్ని పోలి ఉంటుంది. శీతాకాలం ప్రత్యేక అందంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది.

2. ఓం బీచ్, గోకర్ణ అన్యదేశ బీచ్‌లు, మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు సేదతీరేందుకు ఇక్కడికి వస్తుంటారు. కుటుంబతో విహరయాత్రకు వెళ్లాలంటే ఈబీచ్ లు అనువైన ప్రదేశాలు. ఇక్కడ పుట్ బాల్ , క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేసే వీలుంటుంది.

3. గణపతిపూలే బీచ్(మహారాష్ట్ర)
గణపతిపూలే బీచ్ మహారాష్ట్ర రత్నగిరిలో ఉంది, ముంబై నుండి 5 గంటల ప్రయాణం. గణపతిపూలే బీచ్ భారతదేశంలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. నగరం చుట్టుపక్కల నుండి వందలాది కుటుంబాలు ప్రశాంతంగా కుటంబంతో గడిపేందుకు తరలివస్తాయి. చలికాలంలో నీరు సరస్సులా ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ కుటుంబ సభ్యులతో ఈత కొట్టడానికి అనువైన ప్రదేశం.

4. కాషిద్ బీచ్(మహారాష్ట్ర):
మహారాష్ట్రలో మీరు చూడదగిన బీచ్‌లలో ఇది ఒకటి. ఇక్కడి నీరు నీలం రంగులో కనిపిస్తోంది. పారాసైలింగ్, గుర్రపు స్వారీ మరియు జెట్ స్కీ & బనానా రైడ్‌లతో సహా ఇతర వాటర్ స్పోర్ట్స్ వంటి అనేక ఆహ్లాదకరమైన కార్యకలాపాలు ఇక్కడి ప్రత్యేకత.

5. మహాబలిపురం బీచ్: (తమిళనాడు)
భారతదేశంలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగ మహాబలిపురం లేదా మామల్లపురం బీచ్. పిల్లలతో తప్పక సందర్శంచవలసిస బీచ్.ఇక్కడ అద్భుతమైన తాటి చెట్లు.. సముద్రానికి ఎదురుగా నిర్మాణ అద్భుతాల శ్రేణిని దర్శనమిస్తోంది. బీచ్‌లు కాకుండా, మీరు MGM డిజ్జీ వరల్డ్ అనే ఉద్యానవనాన్ని చూసేందుకు ..మహాబలిపురం నుండి చెన్నై ప్రయాణించాల్సి ఉంటుంది.


6. ప్రొమెనేడ్ బీచ్(పాండిచ్చేరి)
పాండిచ్చేరిలో ఎక్కవ సంఖ్యలో బీచ్ లు ఉత్తమమైన ప్రదేశం అంటే ప్రొమెనేడ్ బీచ్. సాయంత్ర వేళలో సందర్శించడానికి గొప్ప ప్రదేశాలు.మీ కుటుంబంతో ఆనందకరమైన సమయాన్ని గడపడానికి వీలుంటుంది. సెలవురోజుల్లో బీచ్ రద్దీగా ఉంటుంది. కాబట్టి మీకు తగినంత ప్రైవేట్ సమయం చూసుకుని వెళ్లడం ఉత్తమం.ప్రొమెనేడ్ బీచ్ పాండిచ్చేరిలోని ఉత్తమ సురక్షితమైన బీచ్‌లలో ఒకటి.

7. కేవెలోసిమ్ బీచ్: (గోవా)
గోవా బీచ్ లకు ప్రసిద్ధి. పార్టీ కల్చర్ కు పెట్టింది పేరు. సహజమైన, అద్భుతమైన బీచ్‌లకు పర్యాయపదం గోవా. అయితే, దక్షిణ గోవాలోని కేవెలోస్సిమ్.. భారతదేశంలోని అగ్ర బీచ్. ఇక్కడ కుటుంబంతో కలిసి కొన్ని డాల్ఫిన్‌లను చూస్తూ అందమైన సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.గోవా బీచ్‌లతో పాటు, చారిత్రక వస్తుశిల్పాలు, మ్యూజియంలకు నిలయం.

 

Optimized by Optimole