ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..దుమ్మురేపిన షమీ, గిల్, రుతురాజ్..

Cricket news: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలుత బౌలింగ్ లో షమీ అదరగొడితే.. బ్యాటింగ్ లో యువ ఓపెనర్స్ గిల్, రుతురాజు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 3 వన్డేల సిరీస్ లో భాగంగా మొహాలీలో జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత  50 ఓవర్లలో 276 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అనంతరం చేధనలో రాహూల్ సేన 48.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.భారత జట్టులో నలుగురు బ్యాట్స్ మెన్స్ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం.

కాగా ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (52) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.భారత బౌలర్ షమీ ధాటికి మిగతా బ్యాట్స్మెన్స్ చేతులెత్తేశారు. ఇంగ్లిస్( 41) లబుషేన్( 39) , గ్రీన్ (31) పరుగులు చేశారు. షమీ 5 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్,జడేజా తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్య చేధనలో భారత ఓపెనర్స్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ ( 74), రుతురాజ్(71) తమదైన శైలిలో రెచ్చిపోయారు. చూడ ముచ్చటైన షాట్లతో అభిమానులను అలరించారు.వీరిద్దరూ పెవిలియన్ కి చేరాక.. కెప్టెన్ రాహుల్(50), సూర్య కుమార్(49) హాఫ్ మిగతా తతంగాన్ని పూర్తి చేశారు. దీంతో భారత జట్టు 48.5 ఓవరల్లోనే లక్ష్యాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లలో జం పాకు రెండు, కెప్టెన్ కమిన్స్ , అబాట్ చెరో వికెట్ పడగొట్టారు. షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

 

Optimized by Optimole