ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని.. దిల్లీ జట్టు 6 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టులో లలిత్ యాదవ్ (48) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబయి బౌలర్లలో బాసిల్​ థంపి మూడు వికెట్లు..మురుగన్​ అశ్విన్​ రెండు వికెట్లు..మిల్స్​ ఒక వికెట్​ పడగొట్టాడు.

Optimized by Optimole