రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!

ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్ కత్తా బౌలర్ల ధాటికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో భనుక రాజపక్స (31) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కగిసో రబాడ (25) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌ నాలుగు.. టిమ్‌ సౌథీ రెండు, శివమ్‌ మావి, సునీల్ నరైన్‌, ఆండ్రూ రసెల్ తలో ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్ కత్తా జట్టు 14.3 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఆ జట్టులో ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్‌ (70 ) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ (26) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు, ఓడీన్‌ స్మిత్‌, రబాడ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

Optimized by Optimole