irumudi: ఇరుముడి మూవీ ఎలా ఉందంటే..?

Irumudi review:

ఆడపిల్లల పెంపకం… తల్లిదండ్రుల బాధ్యత… సమాజం పట్ల మన ఆలోచనా విధానం…
ఈ సున్నితమైన అంశాలను కథాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’.రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?సామాజిక సందేశంతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయింది?తెలుసుకుందాం ఈ ప్రత్యేక సినిమా రివ్యూలో.

సామాజికంగా ఆలోచింపజేసే కథను ఎంచుకోవడంతోనే ఇరుముడిపై ఆసక్తి మొదలవుతుంది. ముఖ్యంగా ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రిని ఈ సినిమా ఆలోచింపజేసే అంశాలను ప్రస్తావిస్తుంది.కథను ఎక్కడా పక్కదారి పట్టించకుండా, చెప్పాలనుకున్న విషయాన్ని దర్శకుడు శివ నిర్వాణ నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఫస్ట్ హాఫ్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
తండ్రి–కొడుకుల అనుబంధం, ఆడపిల్లల పెంపకంపై సాయి కుమార్ చెప్పే సంభాషణలు, కథలో నడిచే సస్పెన్స్… ఇవన్నీ కలిసి ఆసక్తిని పెంచుతాయి.ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ సీన్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంటుంది.

సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్ కథను మరో మలుపు తిప్పుతుంది. ట్విస్ట్ తర్వాతి ఎపిసోడ్‌ను ఇంకాస్త బలంగా రాసి ఉంటే సినిమా ప్రభావం మరింత పెరిగేది.

అయితే ఎమోషనల్ డ్రామాను మాత్రం దర్శకుడు సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో పండించిన భావోద్వేగం ప్రేక్షకులను కదిలించేలా ఉంటుంది.

ఇక థియేటర్‌లో మాస్ మూమెంట్ విషయానికి వస్తే… ‘మల్లెపూల పల్లకి’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఈ సీన్‌కు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి విజిల్స్, చప్పట్లు వచ్చే అవకాశం ఉంది. కథలోని సీరియస్‌నెస్ మధ్య ఈ కమర్షియల్ టచ్ మంచి రిలీఫ్ ఇస్తుంది.రవితేజ విషయానికి వస్తే… తన స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా సామాజిక ప్రాధాన్యత ఉన్న కథను ఎంచుకోవడం అభినందనీయం.శివ నిర్వాణ తనదైన ఎమోషనల్ ట్రీట్‌మెంట్‌తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. కొన్ని చోట్ల మరింత పకడ్బందీగా కథనం ఉండాల్సిన అవసరం కనిపించినా, చెప్పాలనుకున్న సందేశాన్ని మాత్రం బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మొత్తంగా… సందేశం, భావోద్వేగం, సస్పెన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసిన చిత్రంగా ఇరుముడి నిలుస్తుంది.ముఖ్యంగా ఆడపిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యతపై ఆలోచింపజేసే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకత.

Newsminute24 రేటింగ్ : 2.75/5.

Optimized by Optimole