హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదన వాస్తవం..

Nancharaiah merugumala senior journalist: (ఆర్థిక సంస్కరణలు పీవీతో ఆరంభమయ్యాయనే దాంట్లో ఎంత నిజం ఉందో..హైదరాబాద్ ఐటీ రంగం చంద్రబాబుతో మొదలైందనే వాదనలోనూ అంతే వాస్తవం ఉంది!)

ఇండియాలో ఆర్థిక సంస్కరణలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారితోనే ఆరంభమయ్యాయనే అబద్ధాన్ని దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలయి, విస్తరించిందనే ప్రచారాన్ని మాత్రం ఆమోదించడానికి కొందరికి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని తెలుగునాట నేడు విస్తరిస్తున్న బ్రాహ్మణ అనుకూల, కమ్మ వ్యతిరేక ధోరణిగా పరిగణించాలనిపిస్తోంది. బ్రామ్మలు, కమ్మలు కాని ‘ఇతరులు’ ఈ వివాదాల్లోకి దిగి తీర్పులు చెప్పడం సబబు కాదు. ఈ గోడవల్లోకి కొందరు దళిత, ఓబీసీ, కాపు, రెడ్డి మేధావులు వేళ్లు, కాళ్లు పెట్టకపోతేనే మేలు.