Janasenacartoon: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా నడుస్తోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీ..ఇటు ప్రతిపక్ష టిడిపి, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి చేపట్టిన ‘ ఎందుకు ఆంధ్రకు జగనే కావాలి ‘ కార్యక్రమంపై జనసేన పార్టీ కౌంటర్ గా రూపొందించిన కార్టూన్ పై సర్వత్రా చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలోను కార్టూన్ పై జన సేన , టీడీపీ నేతలు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో వైసీపీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సోషల్ వార్ నడుస్తోంది.
ఇక ‘ ఎందుకు ఆంధ్రకు జగన్ వద్దంటే ‘ క్యాప్షన్ తో జనసేన రూపొందించిన కార్టూన్ పరిశీలిస్తే..” సీపీఎస్ రద్దు చేయలేదు జీతాలు టైం కు రావు.. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మోసం చేశాడు.. మందు ఏరులై పారుతుంది.. 8 సార్లు కరెంట్, బస్ ఛార్జీలు పెంచాడు.. ‘ రాజధాని లేకపాయే.. ప్రత్యేక హోదా రాకపోయే’.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసే” ..వంటి అంశాలను జోడించారు. ఇదే అదనుగా వైసీపీ వైఫల్యాన్ని బేస్ చేసుకుని జనసైనికులు, టీడీపీ అభిమానులు కామెంట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మరోసారి జగన్ అధికారంలోకొస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తూ కామెంట్లు జోడిస్తునారు.