ల్యాప్ టాప్ డాటా గల్లంతు.. మల్లారెడ్డి vs ఐటీ అధికారి..

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారి రత్న కుమార్ ల్యాప్ టాప్ చోరీ విషయంలో గందర గోళం కొనసాగుతోంది. ల్యాప్ టాప్ లోని  విలువైన డేటా తొలగించారని మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రత్న కుమార్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు  మంత్రి అనుచరులు ల్యాప్ టాప్ ఇంట్లోనే ఉందని చెప్పడంతో పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు.

కాగా ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని  ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. అయితే ఐటీ అధికారులు మాత్రం ల్యాప్ టాప్  తీసుకెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఆ ల్యాప్ టాప్  తనది కాదని  రత్నాకర్  చెప్పడంతో.. ప్రస్తుతం ల్యాప్ టాప్  బోయిన్ పల్లి పోలీసుల వద్దే ఉన్నట్లు సమాచారం.