తాండూరు కాంగ్రెస్ కు ఆశాకిరణంలా కనిపిస్తున్న నేత..!!

తాండూర్ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది.ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన తర్వాత..సరైన నాయకత్వంలేక డీలాపడిన కాంగ్రెస్  శ్రేణులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తూ ఆశాకిరణంలా దూసుకొచ్చాడు పట్లోళ్ల రఘువీరారెడ్డి. ఎన్నికల్లో వరుస ఓటములు..అంతర్గత కలహాలతో సతమతమవుతున్న నేతల్ని ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు.అసలు ఉన్నట్టుండి రేస్ లోకి దూసుకొచ్చిన  రఘువీరారెడ్డి రాజకీయ  నేపథ్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులను తట్టుకుని నిలిచి గెలిచే సత్తా అతనిలో ఉందా? 

వికారాబాద్ జిల్లా రాజకీయం ఎప్పుడూ రసకందకాయంగా ఉంటుంది.ముఖ్యంగా  ఎంతోమంది రాజకీయ ఉద్దండులను రాష్ట్ర రాజకీయాలకు అందించిన ఘన చరిత్ర తాండూరు నియోజకవర్గానిది. అలాంటి చోట దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేక కొట్టుమిట్టాడుతోంది. ఈనేపథ్యంలో నేనున్నానంటూ రేస్ లోకి దూసుకొచ్చాడు  రఘువీరారెడ్డి.  కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిన నాటినుంచి.. పార్టీ క్యాడర్ చేజారిపోకుండా  కాపాడుతున్నాడు.22 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తూ..  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి  రాజకీయ ఉద్దండులకు పోటి ఎవరన్న ప్రశ్నకు సమాధానంలా కనిపిస్తున్నాడు రఘువీర్ రెడ్డి.

ఇదిలా ఉంటే..గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత అంటూ కాంగ్రెస్ ప్రకటించడంతో రఘువీరా రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.ఇప్పటివరకు వికారాబాద్ నియెజకవర్గం..ధారూర్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్యాడర్ కు భరోసా కల్పించిడం వంటి అంశాలు అతనికి ప్లస్ కానున్నాయి.ఇక రేవంత్ పీసీసీ అయ్యాక పార్టీలో రఘువీరకు ప్రాధాన్యత మరింత పెరిగింది.అంతేకాక పీసీసీ ప్రధాన అనుచరుడిగా పేరుడటంతో త్వరలోనే జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారన్న వార్త నియోజక వర్గంలో వినిపిస్తోంది.

మరోవైపు పార్టీ ఆదేశిస్తే పోటికి సై అంటున్నారు రఘువీరారెడ్డి.22 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నానని..ఇటీవలే తన కృషిని అధిష్టానం గుర్తించి అభినందించిదని పేర్కొన్నారు. తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పలుగ్రామాలకు ఇంచార్జీ బాధ్యతలు సైతం అప్పగించదని అన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష రేసులో తాను ముందు వరుసలో ఉన్నట్లు స్పష్టం చేశారు.పార్టీ ఏపదవి అప్పగించిన పార్టీ నాయకత్వానికి..శ్రేణులకు పూర్తి న్యాయం చేస్తానని రఘువీరా రెడ్డి  హమీ ఇచ్చారు.