చైనా పారిశ్రామిక వేత్త, బిలియనిర్ అలీబాబా లిమిటెడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఓ ప్రెవేట్ కార్యక్రమంలో కనిపించడంతో మూడు నెలల సస్పెన్స్కి తెరపడింది. కార్పొరేట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జాక్ చైనాలోని ప్రభుత్వ బ్యాంకుల తీరును బహిరంగంగా ఎండగట్టాడు. దీంతో అప్పటినుంచి జాక్ కనిపించకపోవడంతో చైనా నియంత జిన్పింగ్ ఏదైనా చేసిఉంటాడని రకరకాల ప్రచారాలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ జాక్ ఓ వీడియో కాన్ఫరెన్స్లో కనిపించడంతో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా గ్రామీణ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను ప్రశంసించే కార్యక్రమం కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ లో మాట్లాడుతున్నాని త్వరలో నేరుగా వచ్చి కలిస్తున్నాని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్నాళ్ల సస్పెన్స్ కి తెరపడింది.
మరోవైపు అలీబాబా గ్రూప్ వ్యాపార సంస్థలపై ప్రభుత్వ సంస్థల దాడులు నేపథ్యంలో జాక్ కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.