జగన్ పాలనపై జనసేన సెటైరికల్ కార్టూన్.. కామెంట్లతో ఆడేసుకుంటున్న జనసైనికులు..

Janasena: జగన్ ప్రభుత్వంపై జనసేన సెటైరికల్ కార్టూన్స్ తో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఆ పార్టీ రూపొందించిన కార్టూన్ పై సోషల్ మీడియాలో జన సైనికులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు నెటిజన్స్ సైతం తమదైన శైలిలో వైసిపి ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు.

ఇక తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ పరిశీలిస్తే.. ఇక లాభం లేదు ఈవిఎమ్ బటన్ నొక్కి.. ఈ బటన్ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిందే క్యాప్షన్ కి తోడు.. జగన్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు ట్యాగ్ లైన్ తో కూడిన కార్టూన్ ఆపార్టీ  సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది అటు జన సైనికులు..ఇటు నెటిజన్స్ దొరికిందే అదనుగా కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.

Optimized by Optimole