దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సంతాప సభను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈనేపథ్యంలో కన్నడ పవర్ స్టార్‌కు ఘన నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ కు ప్రతిష్ఠాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్రకటిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. ఈ అవార్డును అతని కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు తెలిపారు. కాగా అతిచిన్న వయుసులో అవార్డు దక్కించుకున్న వ్యక్తిగా పునీత్ నిలిచాడు.
కాగా పునీత్ రాజ్ కుమార్ గత నెలలో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదానికి గురిచేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
నటుడిగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తన సోంత ఖర్చుతో అనేక ఉచిత విద్య, అనాధాశ్రామలు , గోశాలలు ఏర్పాటు చేసి వేలమందికి ఆశ్రయంతో పాటు ఉపాధి కల్పించారు. అతని మరణాంతరం ఈవిషయాలు వెలుగులోకి రావడంతో ప్రాంతాలకు అతీతంగా అతనిని అభిమానించే సంఖ్య పెరుగుతూ పోతోంది.
ఇక తమిళ నటుడు విశాల్ మానవత్వంతో పునీత్ చదివిస్తున్న 1800 మంది విద్యార్థుల బాద్యతను తాను తీసేకుంటున్నట్లు వెల్లడించాడు. తనకు సొంత ఇల్లు లేనప్పటికి వారికి అండంగా ఉంటానని స్పష్టం చేశారు.

Posted inNews