కివీస్ పై భార‌త్ గెలుపు… స‌రికొత్త రికార్డు న‌మోదు..!!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి అనూహ్యంగా నిష్క‌మించిన భార‌త్ .జ‌ట్టు న్యూజిలాండ్ తో సిరిస్ ను విజ‌యంతో ప్రారంభించింది.జైపూర్​ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేద‌న‌లో టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ , కెప్టెన్‌ రోహిత్ శర్మ అర్థ శ‌త‌కాల‌తో రాణించారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2,
సౌథీ, డారిల్ మిచెల్, సాట్నర్‌ తలో వికెట్‌ తీశారు.
కాగా కివీస్‌పై విజయంతో టీమ్​ఇండియా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో ఛేజింగ్​లో ఎక్కువసార్లు విజయం సాధించిన జట్టుగా నిలిచింది టీమ్​ఇండియా.భార‌త్ 50 విజయాలతో మొద‌టి స్థానంలో నిల‌వగా.. ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ జట్లు 49 టీ20 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.