కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు?

పార్థ సారథి పొట్లూరి:

తెలంగాణా సీఎం కూతురు ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.తనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయకుండా.. విచారణ కోసం సమన్లు పంపించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం  పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆమె తరుపున కపిల్ సిబాల్ సుప్రీం కోర్టు లో వాదనలు వినిపించాడు. తన క్లయింట్ అయిన కవిత కి ED సమన్లు ఇవ్వడం చట్టవిరుద్ధం అని పేర్కొన్నాడు. అసలు సిబిఐ FIR లో నిందితులలో కవిత పేరు లేదని.. అటువంటప్పుడు ED ఎలా సమన్లు పంపిస్తుందని వాదించారు. కవిత మహిళ అని చూడకుండా ఇప్పటికే రెండు సార్లు రోజుకి 10 గంటల చొప్పున విచారణ చేశారనీ అదీ రాత్రి అయినా సరే తొందరగా వదలలేదనీ విచారణలో ఆయన పేర్కొన్నాడు. ఈడీ  ఇక ముందు కవితకి సమన్లు పంపకుండా, అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు  ఇవ్వమని కోరాడు కపిల్ సిబాల్ !

అయితే  పిటిషన్ పై విచారణ అనంతరం ఇద్దరు సభ్యుల కల ధర్మాసనం  (జస్టిస్ అజేయ్ రస్తోగి, బేల M త్రివేది)  వాదనలు విన్న తరువాత కవితకి ఎంఫోర్సెమెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపించకుండా, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్ధనని తిరస్కరించింది.

ఒక మహిళ ని ED ఆఫీసుకి పిలిపించి విచారణ చేయాలా వద్దా అనే విషయంలో ఇప్పటికే రెండు కేసులు సుప్రీం కోర్టులో విచారణ సంగతిని ఇద్దరు న్యాయమూర్తులు ప్రస్తావించారు. ఓ కేసు లో P.చిదంబరమ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు చిదంబరం భార్య అయిన నళినీ చిదంబరం కి అప్పట్లో ED సమన్లు పంపించింది కానీ నళినీ చిదంబరం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. మహిళని ED ఆఫీసుకి పిలిచి ఎలా విచారణ చేస్తారంటూ ! రెండవది తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అభిషేక్ బెనర్జీ భార్య కూడా సుప్రీం కోర్టు లో పిటిషన్ వేసింది. అయితే ముగ్గురు సభ్యులు గల ధర్మాసనం నళినీ చిదంబరం కేసుని విచారిస్తూ ఈడీ కి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి కాబట్టి పిలిచినప్పుడు హాజరయ్యి విచారణకి సహకరించాల్సిందే అంటూ తీర్పు వెలువరించింది ధర్మాసనం !

ఇక కవిత విచారణ సందర్భంగా ఇద్దరు సభ్యులు కల ధర్మాసనం నళినీ చిదంబరం కేసుని ఉదహరిస్తూ కవిత పిటిషన్ మీద మరో మూడు వారాల తరువాత విచారణ చేస్తామని కుండ బద్దలు కొట్టింది. మరో మూడు వారాల వరకు దర్యాప్తు సంస్థ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సిందేనని తేల్చేసింది. ఇంట్లో విచారణ చేయండి అనో లేక నాకు పనులు ఉన్నాయనో సాకులు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది.

మొత్తంగా  మూడు వారాల లోపు కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.  

జైహింద్ ! జై భారత్ !

Optimized by Optimole