Hyderabad: కవిత సస్పెన్షన్ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర…?

హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల కనిపిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిత్వ హననం కోసం కొందరు పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలే ఆరోపిస్తున్నాయి.కుట్రలో భాగంగానే కవిత సస్పెన్షన్ జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

మొదటగా ఒక స్వయంప్రకటిత మేధావి ద్వారా కవితపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయించి, ఆ వీడియోలను కార్యకర్తల చేత సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కవితను ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలన్న లక్ష్యమే ఉందని విమర్శలు వినిపించాయి.

తాజాగా “కవిత కెసిఆర్‌కు వ్యతిరేకంగా పని చేస్తోంది” అనే విష ప్రచారం కూడా అదే శైలిలో మొదలైంది. ఎలాగైనా కవితను కెసిఆర్‌ నుంచి దూరం చేయాలనే అజెండాతోనే ఈ ప్రణాళిక నడుస్తోందని టాక్ బలంగా వినిపించింది. కుట్రలో భాగంగానే కేసిఆర్ పై ఒత్తిడి తెచ్చి కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారని జాగృతి సంస్థ మద్దతుదారులు ఆరోపణలకు బలం చేకురినట్లు అయ్యింది.

గతంలో ఎన్టీఆర్‌, ఇతర ప్రముఖ నాయకుల ప్రాధాన్యత తగ్గించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తన ఆస్తాన మీడియా, సోషల్ మీడియా వేదికగా “వ్యక్తిత్వ హననం” అనే అస్త్రాన్ని తరచుగా వినియోగించేవారని గుర్తుచేస్తున్నారు. అదే స్ట్రాటజీని ఇప్పుడు బీఆర్ఎస్‌లోని కొంత వర్గం కవితపై ప్రయోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొత్తంగా వ్యక్తిగత విమర్శలతో కవిత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసే ఈ ప్రయత్నాలను రాజకీయ పరిశీలకులు “ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర”గా అభివర్ణిస్తున్నారు.

Optimized by Optimole