×

కవీ!
నీ భావసంపదకు వందనాలు,
నీ ఊహశాల్యతకు నమస్సులు,
నీ కవితా పటిమకు నీరాజనాలు.
ఓ IAS అధికారిగా పాలనా గురుతర బాధ్యతల్లో ఉంటూ కూడా తెలుగు సాహితీ సేద్యం చేసిన కృషీవళుడు డా.జె.బాపురెడ్డి. ‘….. అంతరాల ఈ గోడ పగులగొట్టు, సరికొత్త మేడ కట్టు’ అని సినిమా థియోటర్లలో నీ పాట వినిపించే ఆ రోజుల్లో బడికి వెళుతుండిన బాల్యం మాది.
సృజనతో, భావుకతతో… ప్రతి మనిషిలో జనించే వ్యక్తావ్యక్త ఆనంద పారవశ్యానికి తార్కిక జ్ఞానంతో, శాస్త్ర విజ్ఞానంతో పని లేదు, పేచీ కూడా లేదంటాడీ కవివరుడు. మనస్పందన, తార్కిక వాదం రెండూ, రెండు తీరాల వంటివట భావనానందంతో పరవళ్లు తొక్కే నదికి. మేధో శక్తి ఎంతో పెరిగి శాస్త్రీయ దృక్పథంతో ప్రశ్నిస్తున్నా…. ఇంద్రియానుభూతి కేం లోటురాదంటాడు, చూడండి…
ఉ:
అందము అందమే మనకు అందిన
అందక పోయినన్, మన
స్పందన వేరు తార్కిక వివాదము
వేరవి రెండు భావనా
నంద నదీ తట ద్వయము నా
విలసిల్లును ఇంద్రియాను భూ
తీందిర పేదవోదు పడగెత్తిన
ధీ బలశాస్త్రమెంతయున్

దీన్ని ఆయన శాస్త్రీయంగా నిరూపించారు కూడా! చంద్రుడొక ఉపగ్రహం. రాళ్లూ, రప్పలూ తప్ప…..తాగడానికి నీరు, పీల్చడాని గాలీ సహితం లేని ఓ పెద్ద గందరగోళమని తెలిసినా, శాస్త్రీయంగా అది దృవపడినా… రివ్వున వీచే చల్లగాలిలో ఓ రాత్రిపూట ఆకాశంలో వెన్నెలలీనే చంద్రబింబాన్ని చూసి చలించకుండా ఉండగలమా?
“…… రేల నబోంతరాల శశిరేఖల జూసి చలింపకుందుమే?”
అని ప్రశ్నిస్తాడు.
‘నన్నయ నుంచి నా వరకు…..’ అని పద్యాన్నే కాకుండా గద్యాన్ని, గేయాన్ని, కవితని, కథల్ని, కథానికల్నీ, ఇలా తెలుగునాట ఎన్నెన్నో సాహితీ ప్రక్రియల్ని సుసంపన్నం చేసి, పాతికకు పైగా పుస్తకాలు రాసిన ఆయన పరమపదించారు.
ఆయన నుంచి అపారమైన స్ఫూర్తినే కాదు, అవ్యాజమైన ప్రేమని, వాత్సల్యాన్నీ పొందినవాడిని నేను!
నిండు హృదయంతో
కవివరా నీకిదే నివాళి..

============

ఆర్. దిలీప్ రెడ్డి 

పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Telangana: “తుపాకీ నుంచి ప్రజాస్వామ్యానికి?”

సిద్ధార్థ (జర్నలిస్ట్): ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా...

Read out all

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే...

Read out all
Optimized by Optimole