Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా అధికారపక్షం కొనసాగింపు కోసం జరగనున్నాయని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ అస్సాంలో తాజాగా నిర్వహించిన రెండో ట్రాకర్ పోల్ సర్వేలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇంకా ఐక్యతా లోపాలతో తడబతున్నట్టు…

Read Full News

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…

Read Full News

ap: ప్రమాదంలో గ్రామ సచివలయాలు: పీపుల్స్ పల్స్

Appolitics: పారదర్శక ప్రజా విధాన విశ్లేషణకు అంకితమైన పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి సర్వే ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం, ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు మరియు మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా సాగింది. పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది,…

Read Full News

Telangana: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచే…

Read Full News

Telangana: పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవ జాతి మనుగడకు ప్రమాదకరం:గుత్తా సుఖేందర్

Telangana: పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మానవ జాతి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం వల్ల భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని, ఆ దిశగా ప్రజలు చైతన్యం పెంచుకోవాలని కోరారు.పశు సంపదను పెంచు కోలేకపోతే వచ్చే 5 ఏళ్లలో మన భూమి,మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు….

Read Full News

Telangana: ‘విత్తు’ను కాపాడుకోకుంటే ‘విపత్తు’..!!

Telangana: ‘విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది’ అంటాడు శివసాగర్! వేల సంవత్సరాలు దేశీ విత్తనాలు మన వ్యవసాయాన్ని పరిపుష్టం చేస్తూ ఆహార భద్రతకు, ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చాయి. రైతు నిశ్చింతగా, వ్యవసాయం అదుపాజ్ఞల్లో, నేలసారం సురక్షితంగా, వాతావరణం సమతుల్యతతో, ప్రకృతి పరిశుద్ధంగా ఉన్నాయి. అధిక దిగుబడి కోసం వచ్చిన ‘హరిత విప్లవం’ గొడుగు కింద ముందు, వెనుకలాలోచించకుండా చేసిన కొన్ని చర్యలవల్ల పర్యవసానాలు వికటించాయి. పంట దిగుబడి అసాధారణంగా పెరిగి అప్పటి అవసరాల మేర…

Read Full News

National: ఉప ఎన్నికల ఫలితాలు అన్ని పార్టీలకు పాఠమే..!!

National: రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల అనంతరం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఆప్ రెండు స్థానాల్లో, బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ చెరో స్థానంలో గెలిచి ఊరట చెందగా, కేరళలో అధికార సీపీఐ (ఎం) మాత్రం భంగపాటుకు గురయ్యింది. ఈ ఫలితాలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు కొంత ఆనందం, కొంత దు:ఖం…

Read Full News

Annacanteen: అన్న క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక..!

Peoples pulse: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘‘అన్న క్యాంటీన్ పథకం’’ పై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నివేదిక విడుదల చేసింది. కేవలం 5 రూపాయిలకే భోజనం అందిస్తున్న ఈ ‘‘అన్న క్యాంటీన్స్’’ పనితీరుపై పీపుల్స్ పల్స్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా పలు అన్న క్యాంటీన్లను సందర్శించి, సమీక్షించి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు నివేదికలో పేర్కొంది. టీడీపీ 2019లో అధికారం కోల్పోవడంతో అన్న క్యాంటీన్లను వైఎస్సార్సీపీ…

Read Full News

literature: జ్ఞాన పరిమళ పుస్తక పుష్పాలు..!

Telugu literature: తెలుగునాట రాజకీయ పుస్తక రచన తక్కువ. సమకాలీన రాజకీయ పరిణామాల మీద విశ్లేషణాత్మకమైనవి మరీ తక్కువ. అధీకృత డాటా, సాధికారిక సమాచారం, తెరవెనుక సంగతులను సమ్మిళితం చేసి వెలువరించిన… వ్యాఖ్యాయుతమైన పుస్తకాలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకటీ, అరా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాలకు సంబంధించి తెలుగులోనే కాక ఇంగ్లీషులోనూ లేవు ఎందుకో! సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు వంటి ఒకరిద్దరు రాసిన కొన్ని పుస్తకాలున్నా అవి డాటా ప్రధానమైనవి మాత్రమే! సీనియర్…

Read Full News

MaharashtraexitPoll: ‘మహాయుతి’కి జైకొట్టిన మహారాష్ట్ర: పీపుల్స్ పల్స్

Maharashtra exit Poll2024:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ‘మహా’సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయలాంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగున్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. 2019లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రెస్ పంచన చేరడంతో 2024 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ, శివసేన (ఏక్నాథ్ శిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి, కాంగ్రెస్,…

Read Full News
Optimized by Optimole