దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:
అన్నం ఉడికిందీ లేనిది తెలుసుకోవడానికి ఒకటి, రెండు మెతుకులు పట్టి చూస్తే చాలు, ఇట్టే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ పరిస్థితి ముందు నుంచీ మాకు లీలగా కనిపిస్తూనే వుంది. మా ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ ప్రజాక్షేత్రం నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని సర్వే గణాంకాల రూపంలో కౌంటింగ్ కు ముందే విలేకరుల సమావేశం పెట్టి వెళ్లడించాం. అంతకన్నా స్పష్టంగా ఆర్టికల్స్ రూపంలో ఎప్పటికప్పుడు మీడియా మాధ్యమం ద్వారా చెబుతూనే వచ్చాం. ఎవరు విన్నారు గనక! రాజకీయ నాయకులు, బుద్దిజీవులనే కాదు… కడకు సమకాలీన జర్నలిస్టులు కూడా చదవటం మహా బేషుగ్గా మానేశారు.
గత రెండు మూడు మాసాల్లో చాలా చాలా రాజకీయ కథనాలు, విశ్లేషణలూ ఇచ్చాం. మచ్చుకొక మూడింటిని ఇక్కడ గుర్తు చేస్తా! (క్లిప్స్, లింక్ లు కింద వున్నాయి)
కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటీ నువ్వా, నేనా? అన్నట్టుంది. ఎవరి క్లెయిమ్స్ ఎలా వున్నా ఎవరికీ రెండంకెల స్థానాలు రావు. బీఆర్ఎస్ ఖాతా తెరిస్తే గొప్ప, మెజారిటీ తగ్గినా ఎంఐఎం గెలుపు ఖాయమని రాశాం! ఫలితం 8-8-0-1 గా వచ్చింది (తెలంగాణ)
ttps://www.v6velugu.com/bjp-congress-fight-for-double-digits-in-telangana-lok-sabha-elections-2024
‘why not 175’ అని తెంపరితనం చూపిన ఏపీ సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రచార వేళ ఆ మాటే మరచిపోయారు. కానీ, విచిత్రంగా కూటమి బలోపేతమవుతున్న క్రమంలో… ఒక నినాదం శిబిరం మారుతోందా? అటువైపు నుంచి ‘why not 175 to us!’ అని, ఇటువైపునకు వచ్చి, ఆంతరంగిక చర్చలు, సంభాషణల్లో కూటమి ముచ్చట పడుతున్నట్టు ఆర్టికల్ ఇచ్చాం.
136 + 21 + 8 (165 vs 10) కడపటి ఫలితం ఇపుడు దాదాపు ఇలాగే మాటాడుతోంది. (ఆంధ్రప్రదేశ్).
సొంతంగా 370, కూటమికి 400+ అనే మైండ్ గేమ్ లో… ఏమేమో మాటాడుతున్నారు. ఆధిపత్య సాధనకు మాటే మంత్రం – కానీ, వాస్తవం భిన్నం. I.N.D.I.A కూటమి, NDA ఆశిస్తున్నంత, ప్రచారం చేస్తున్నంత అద్వాన్నంగా ఏం లేదు. దూసుకువస్తోంది. మధ్యలో కొంత తడబాటు లేకుంటే, INDIA ప్రదర్శన ఇంకా మెరుగ్గా వుండి, NDA కి చెమట పట్టించేది అని గణాంకాలతో విశ్లేషించాం.
(Now it seems…..NDA 290 vs INDIA 235)
(భారతదేశం)
https://www.v6velugu.com/pm-modi-and-amit-shah-is-playing-mind-game-during-lok-sabha-election-campaign