Kumariaunty: కాపుల పేరు నిలబెట్టిన కుమారి ఆంటీ ..

Nancharaiah merugumala senior journalist:

ఇప్పటి దాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! ” 

ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్‌ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడను ఆనుకుని ఉన్న పెదపారుపూడిలో వేళ్లున్న ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి పేరు, ఈ పట్టణానికి రెండోవైపున్న పెదపాలపర్రు గ్రామానికి చెందిన సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి పేరు ఈ సందర్భంగా చెబుతారు. అలాగే, గతంలో తన కంపెనీల కోసం వేల కోట్ల రూపాయల రుణాలను– ఒకే ఆస్తిని ఏకకాలంలో రెండు బ్యాంకుల్లో హామీ పెట్టి మరీ– తీసుకుని వ్యాపార నష్టాలు చూపించి అనేక జాతీయ బ్యాంకులకు దెబ్బేసేసిన మచిలీపట్నం, ఏలూరు మాజీ ఎంపీ, కాంట్రాక్టర్‌ కం వ్యాపారి, ప్రోగెసివ్‌ గ్రూప్‌ పూర్వ అధినేత కావూరు సాంబశివరావు గారిది ..బెజవాడ నుంచి రైల్లో వస్తుంటే గుడివాడ స్టేషన్‌ ముందు వచ్చే ఊరు దోసపాడు. అక్కడే ఆయన చిన్నప్పుడు పెరిగారు. సీవీ రావు (చలసాని వెంకటేశ్వరావు) అనే స్థిరాస్తి వ్యాపారి కం ఇమేజ్‌ గ్రూప్‌ అధిపతి కూడా గుడివాడ సమీప గ్రామం వానపాముల నుంచి హైదరాబాద్‌ వచ్చి బాగుపడిన మనిషి. సీవీ రావు గారైతే డిగ్రీ చదువు పూర్తవగానే హైదరాబాద్‌ నగరంలో అతిపెద్ద హెచ్‌ పీ గ్యాస్‌ డీలర్‌ అడుసుమిల్లి కృష్ణమూర్తి (మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రై.లి మాజీ ఎండీ కూడా) గారి హైదరాబాద్‌ గ్యాస్‌ కంపెనీలో క్లర్క్‌ కం డెలివరీ బాయ్‌ గా చే రారు. తర్వాత కష్టపడి పైకొచ్చారు. 

 

గుడివాడ ప్రాంత వ్యాపారుల వల్ల హైదరాబాదులో కమ్మ కులానికి ‘నెగటివ్‌ ఇమేజ్‌’

 ఇలా, వ్యాపారాల్లో చాలా పద్ధతిగానూ అవసరమైతే అడ్డగోలుగానూ సంపాదించి హైదరాబాదులో స్థిరపడిన కొందరు గుడివాడ ప్రాంత కమ్మ వ్యాపారుల వల్ల ఈ వ్యవసాయధారిత కులం మొత్తానికి చెడ్డపేరు వచ్చింది. కొందరు ఇతర కులాలోళ్లు కూడా కావూరు వంటి దివాళాకోరు వ్యాపారులను చూపించి గుడివాడ ప్రాంతం నంచి వచ్చిన కమ్మవారంతా జిత్తులమారి మనుషులనే ముద్రవేయడం ఇదివరకు మనం చూసిన వాస్తవమే. అయితే, ఇప్పుడు గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల కన్నా తానేమాత్రం తక్కువ తినలేదని గుడివాడ పట్టణ ంలో కుటుంబ మూలాలున్న మాదాపూర్‌ భోజనాల వ్యాపారి, కాపు కులానికి చెందిన తెలివైన మహిళ దాసరి సాయి కుమారి నిరూపించింది. గతంలో టీడీపీ స్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని గణనీయ సంఖ్యలో అభిమానించని, ఆదరించని కమ్మ కులస్తులు నేడు దాదాపు అందరూ ప్రేమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు చొరవతతో ఉనికిలోకి వచ్చిన హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ప్రాంతంలో స్ట్రీట్‌ ఫుడ్‌ బిజినెస్‌ పెట్టి శేరీ లింగంపల్లి పరిధిలో ఏ కమ్మ వ్యాపారీ సంపాదించని ప్రచారం సొంతం చేసుకున్న గుడివాడ కాపు మహిళ దాసరి సాయి కుమారి. ఆమె నిజంగా గ్రేట్‌. ఇప్పుడు కాపుల రాజ్యాధికార సాధన ప్రాజెక్టుకు కావాల్సింది కుమారీ ఆంటీ వంటి మహిళా నేతలేగాని అనంత శ్రీరామ్‌ వంటి సినీ గీత రచయితలు కాదు. బెజవాడ–నిడదవోలు రైల్వే లైనులో గుడివాడ తర్వాత ఉన ్న కాస్త పెద్ద రైల్వే జంక్షన్‌ భీమవరం ప్రాంతానికి చెందిన గొలుగూరి సత్యనారాయణ రెడ్డిని అల్లుడిగా తెచ్చుకున్న తెలంగాణ యువ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి గారు ఇప్పుడు– గుడివాడలో మూలాలున్న  కాపు వ్యాపారస్తురాలు సాయి కుమారి గారి జీవనోపాధిని కాపాడడం తెలుగునాట గొప్ప సామాజిక పరిణామం. తెలుగునాట రాజ్యాధికారం (ముఖ్యమంత్రి పదవి) పొందడానికి మొదటి హక్కుదార్లు రెడ్డీలేనని ఎప్పుడో బెజవాడ బ్రాహ్మణ మేధావి ఒకరు చెప్పిన మాటలు సబబేననిపిస్తోంది.