kurmajayanthi: నేడు కూర్మ జయంతి.. విశిష్టత ఏంటో తెలుసా?

కూర్మ జయంతి,రేపే కూర్మ జయంతి,కూర్మ జయంతి శుభాకాంక్షలు,కూర్మనాథ జయంతి,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే మీ అప్పులు తీరి డబ్బులు వస్తాయి part1,జూన్29న కూర్మ జయంతి రోజున ఇలా చేస్తే ఐశ్వర్యమే ఐశ్వర్యం part2,కూర్మ యంత్రాన్ని ఇలా పూజిస్తే 41 రోజుల్లో సొంత ఇల్లు ఖాయం,శ్రీకూర్మం చరిత్ర,జూన్ 11 శ్రీ కూర్మ జయంతి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది,విష్ణు మూర్తి,వైశాఖ పూర్ణిమ వైశిష్ట్యం,వైశాఖ పూర్ణిమ సముద్ర స్నానం,లక్ష్మీదేవి

Kurma jayanthi:

️️️️️️️” మంధనాచల ధారణ హేతో .. దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో: భక్తంతే పరిపాలయమామ్ “

కృతయుగంలో దేవ దానవులు అమృతం కోసం క్లీర సాగరం చిలకడం   మొదలెట్టారు.  వాసుకుని తాడుగా చేసుకొని  మందరగిరిని దేవాసురులు పాలసముద్రాన్ని చిలుకుతుండగా.. అనుకోకుండా మందరగిరి సముద్రంలోకి జారిపోతూ సముద్ర మధనానికి ఆటంకం కలిగించింది.  దీంతో దిక్కుతోచని స్థితిలో దేవతలు మహావిష్ణువును శరణువేడారు. అప్పుడు నారాయణుడు కూర్మం రూపం దాల్చి మందగిరిని సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు.  అలా ఉద్భవించిందే కూర్మావతారమని పండితులు చెబుతుంటారు.

శ్రీకూర్మం ;

ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మదేవాలయం  శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉంది. ఈదేవాలయం మండలానికి ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న వంశధారా  నది ఒడ్డున వెలసింది.  కృతయుగంలో శ్వేతరాజు, అతని భార్య వంశధారల తపస్సుకు, భక్తికి మెచ్చుకున్న కూర్మనాధుడు వారి కోరిక ప్రకారం ఈ క్షేత్రంలో పశ్చిమ ముఖంగా వెలిశాడని పురాణ వచన.

ఇక కూర్మక్షేత్ర ప్రస్తావన  బ్రహ్మాండ, పద్మపురాణాలలో ఉంది. రాముడు, బలరాముడు,జమదగ్ని మహర్షి మొదలైన పురాణ పురుషులెందరో ఈక్షేత్రాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. ఈఆలయం మరో విశిష్టత రెండు ధ్వజస్తంభాలు ప్రతిష్టబడి ఉండటం.  ధ్వజస్తంభాలను  శివకేశవుల ప్రతిరూపంగా  చెప్పుకుంటారు. శివకేశవుల ధ్వజ స్తంభాలు  అభేద తత్వాన్ని సూచిస్తాయని పండితులు చెబుతుంటారు.

ఇదిలా ఉంటే కూర్మక్షేత్రంలోని  మూల విరాట్టు సాక్షాత్తు  సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత ప్రతిష్టించబడిందిగా చెప్పుకుంటారు. ఆలయంలోని అత్యంత విశిష్టమైన  స్వామి వారి పుష్కరిణిని శ్వేత గుండం గా పిలుస్తారు.  స్వామి వారి సుదర్శన చక్రం చేత పుష్కరిణి ఆవిష్కరించబడింది. అందుకే గుండంలో స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం.

ప్రతి సంవత్సరం మార్చిలో హోళి పున్నమినాడు ఈఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అత్యంత వైభోవపేతంగా ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు జరిపించడం  ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామికి కళ్యాణోత్సవం జరిపిస్తారు.  జ్యేష్ఠమాసంలో వచ్చే కూర్మ జయంతినాడు స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొంటే సకల శుభాలు జరుగుతాయని పెద్దల ఉవాచ.