యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఫిదాలో పల్లెటూరి అమ్మయి గా మెప్పించిన సాయి పల్లవి లవ్ స్టొరీ చిత్రంలో ప్రేమికురాలి పాత్రలో ఎలా కనిపించబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మొదటి సారి జోడి కట్టిన నాగ చైతన్య , సాయి పల్లవి జోడి మ్యాజిక్ చేస్తారన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది.