మహావీరుడికి ‘మహావీర్ చక్ర’..

రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వీరుడు కల్నల్ సంతోష్ బాబుకు అత్యంత ప్రతిష్టాత్మక ‘ మహావీర్ పరమ చక్ర ‘ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆర్మీలో ‘పరమవీరచక్ర ‘ తర్వాత రెండో అత్యున్నత పురస్కారం ఇదే కావడం విశేషం. గత ఏడాది భారత్-చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికుల దాడిని తిప్పికొట్టే క్రమంలో సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. 16వ రెజిమెంట్ లో విధులు నిర్వహించిన సంతోష్ బాబు స్వస్థలం తెలంగాణలోని సూర్యాపేట. ఆయనకు తండ్రి ఉపేందర్ మంజుల తో పాటు భార్య సంతోషి, కుమారులు అభిజ్ఞ, అనిరుద్ ఉన్నారు.

సైన్యంలో చేరాలన్న సంకల్పంతో..

సంతోష్ బాబుకు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనే బలమైన సంకల్పం ఉండేది. అందులో భాగంగానే స్కూల్ విద్యాభ్యాసమంతా విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ లో జరగడం.. సైన్యంలో చేరడానికి బాగా ఉపకరించింది. 2004లో లెఫ్టినంట్ హోదాలో జమ్మలో సైన్యంలో చేరారు. అనంతరం శ్రీనగర్, కుప్పార, లాద్దక్ లో ఆయన పనిచేశారు. 15ఏళ్ల సర్వీస్ లో నాలుగు పదోన్నతులు పొందారు. కొన్నాళ్లు కాంగో లో విధులు నిర్వహించిన సంతోష్ 37 ఏళ్ల హోదాలో కల్నల్ హోదా పొందాడు.

తెలంగాణ ప్రభుత్వం 1.25 కోట్లు..

అత్యున్నత పురస్కారం పొందిన కల్నల్ సంతోష్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 1.25 కోట్లు ప్రకటించింది. గ్యాలెంట్రి అవార్డ్ పొందిన వారికి ప్రభుత్వం నగదు ప్రకటించడం గత కొన్నేళ్లుగా జరుగుతుంది.

మరో ఐదుగురికి వీర్ చక్ర..
గల్వాన్‌ లోయలో సంతోష్ బాబుతో అమరుడైన మరో ఐదుగురు యోధులకు ‘వీర్‌ చక్ర’ను ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో నాయబ్‌ సుబేదార్‌ నుదురామ్‌ సొరెన్‌, హవల్దార్‌ కె.పళని, నాయక్‌ దీపక్‌ సింగ్‌, సిపాయి గుర్తేజ్‌ సింగ్‌, హవల్దార్‌ తేజీందర్‌ సింగ్‌ ఉన్నారు. తేజీందర్‌ మినహా మిగతా నలుగురికీ మరణానంతరం ఈ పురస్కారం దక్కనుంది.
లద్దాఖ్‌లో స్మారక స్థూపం..
గాల్వాన్‌ వీరులను స్మరించుకుంటూ భారత సైన్యం ఇప్పటికే తూర్పు లద్దాఖ్‌లోని ‘పోస్ట్‌ 120’ వద్ద ‘గ్యాలంట్స్‌ ఆఫ్‌ గల్వాన్‌’ పేరుతో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించింది.