ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు.
ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో ద్రావిడ్ కృషి వెలకట్టలేనిదని రహానే తెలిపాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. కోహ్లీ మంచి మిత్రుడని.. దేశం కోసం ఇద్దరం కలసికట్టుగా పోరాడుతామని.. తను మా సారథి అని.. ఇంగ్లాండ్ సిరీస్ లో బ్యాట్స్మెన్గా నా పాత్రను సమర్ధవంతంగా పోషిస్తానని తెలిపాడు. టీమిండియా ఆటగాళ్లు సిరాజ్, బూమ్రా లపై జాత్యహంకార వ్యాఖ్యలను ఖండిస్తూనట్లు రహానే స్పష్టం చేశాడు.