ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. అతను నటిస్తున్న మొదటి చిత్రం ఉప్పెన ఫిబ్రవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైష్ణవి జోడిగా కన్నడ బ్యూటీ కీర్తి శెట్టి నటిస్తుండగా , ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ నీ కళ్ళు నీలి సముద్రం ‘ ‘ దక్ దక్ దక్’ పాటలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.

చిత్రానికి సంబంధించి తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోవైపు వైష్ణవ్ తేజ్ , కీర్తి శెట్టి లకు డెబ్యూ మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.