మేయర్ ఎన్నిక అమావాస్య రోజే ఎందుకు? : బండి సంజయ్

కొడుకుని సీఎం చేసేందుకే కెసిఆర్ మేయర్ అధ్యక్ష ఎన్నికను అమావాస్య రోజు ఖరారు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మంగళవారం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన  సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకు దోష నివారణ పూజల కోసం కాళేశ్వరం వెళ్లారని.. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇక నికార్సయిన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి అమావాస్య రోజు మేయర్ అధక ఎన్నికను ఎందుకు ఖరారు చేశారని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే కొత్త సచివాలయం కడుతున్నారని, తక్షణమే అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీిలకు  ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.