LuckyBhaskar review:
మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్. తాజాగా అతను నటించిన పాన్ ఇండియా చిత్రం లక్కీ భాస్కర్. కిలాడి ఫేం మీనాక్షి చౌదరి హీరోయిన్. వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..!
కథ:
1990 లో ముంబయి నేపథ్యంలో సాగే కథ ఇది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ ( దుల్కర్ సల్మాన్) మగద బ్యాంకులో సాధారణ ఉద్యోగి. చాలీచాలని జీతంతో భార్య సుమతి( మీనాక్షి చౌదరి)తో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ దొరికిన చోటల్లా అప్పులు చేస్తాడు. ఉత్తమ ఉద్యోగిగా పేరు వస్తుందే తప్పా ప్రమోషన్ రాదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఏం చేసినా తప్పు లేదనుకొని రిస్క్ చేస్తాడు.ఇంతకు భాస్కర్ చేసిన రిస్క్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
మధ్యతరగతి కుటుంబ కష్టాలు.. వాటి నుంచి గట్టెక్కేందుకు చేసే ప్రయత్నాలు ఆధారంగా లక్కీ భాస్కర్ తెరకెక్కించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ కథలో కీలకమైన అంశం 1990లో భారతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన అర్షద్ మెహతా స్కాం.
మూవీ ఫస్ట్ ఆఫ్ పరంగా బాగుంది.
సెకండాఫ్ పరంగా పర్వాలేదు. సినిమాలో అక్కడక్కడ వచ్చే సన్నివేశాలు.. ఇంతకుముందు సినిమాల్లో, సిరీస్లో చూసినవిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయి. మధ్య తరగతి వ్యక్తికి కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు అన్న పాయింట్ బాగుంది.
ఎవరెలా చేశారంటే..?
దుల్కర్ సల్మాన్ వన్ మ్యాన్ షో గా అదరగొట్టేశాడు. మధ్యతరగతి వ్యక్తిగా పాత్రలో జీవించేశాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి అందం,అభినయం పరంగా ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలలో పరిణితికి మించి నటించింది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతికంగా:
దర్శకుడు వెంకీ అట్లూరి తను చెప్పాలనుకున్న కథను ప్రజెంట్ చేయడంలో కొంత మేర విజయం సాధించాడు. కథనం పరంగా కొంత కేర్ తీసుకుంటే బాగుండేది. గెలుపు తర్వాత ఓటమి.. ఓటమి తర్వాత గెలుపు సంభాషణలు ఆకట్టుకుంటాయి. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకే హైలెట్. సినిమాటోగ్రఫీ అద్భుతం. నిర్మాణ విలువలు బాగున్నాయి.
”ఒక్క మాటలో చెప్పాలంటే లక్కీ భాస్కర్ నిజంగానే లక్కీ..జాక్ పాట్ కొట్టేశాడు ”
రివ్యూ: 2.75/5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)