‘ రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ..

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజాచిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఇప్పటీకే సరైనా హిట్ లేక బాక్సాఫీస్ కళ తప్పింది. దీంతో అభిమానులు ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఇంతకు మాస్ మహారాజా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారా లేదా చూద్దాం!

కథ :
రామారావు (రవితేజ )డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. న్యాయం కోసం ఎంతదూరమైన వెళతాడు. దీంతో అతనికి అనేక అవంతరాలు ఎదురవుతాయి. ఈక్రమంలోనే సొంత జిల్లా చిత్తూరుకు బదీలి మీద వస్తాడు. అప్పటీకే ఆ ప్రాంతంలో ఎర్రచందనం మాఫియా రాజ్యమేలుతూ ఉంటుంది. తన చిన్ననాటి స్నేహితురాలు మాలినీ(రజిషా విజయన్) కష్టంలో ఉందని పలకరించడానికి వస్తాడు. తన భర్త ఆచూకీ తెలియక ఆమె ఇబ్బంది చూసి చలించిపోతాడు. అతన్ని వెతకడానికి వెళ్లిన మావయ్య కూడ ప్రమాదంలో మరణించాడని తెలిసి సాయం చేయాలని భావిస్తాడు.మాళిని భర్తను వెతికే క్రమంలో .. 20 మంది అమాయకులను మాఫియా మట్టుబెట్టిందని తెలుస్తుంది. ఇంతకు రామారావు ఎర్రచందనం మాఫియా ఎలా ఎదుర్కొన్నాడు?చివరికి మాళిని భర్తను రక్షించాడా?లేదా అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

పనితీరు..
ఇక ఎలాంటి కథనైనా అలవోకగా పండిచడం రవితేజ స్పెషాలిటీ. కానీ దర్శకుడు మాస్ మహారాజ్ కు తగ్గట్టుగా కథను నడిపించలేకపోయాడు. ఫస్ట్ ఆఫ్  అంతా సోసో నడుస్తుంది. సెకాండాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని తికమక పెడతాయి.సంభాషణల మీద పెట్టిన శ్రద్ధ.. స్క్రీన్ ప్లే పెడితే సినిమా మరో లెవల్ లో ఉండేంది. క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

ఇక నటనపరంగా ఎప్పటిలానే మాస్ మహారాజా తన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో రవితేజ నటించిన తీరు అద్భుతమని చెప్పాలి. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే.. దివ్యాంశ కౌశిక్ అందం అభినయంతో ఆకట్టుకుంది. రజిషా విజయన్ సైతం ఉన్నంతలో ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరో వేణు.. తన నటనతో ఆకట్టుకున్నాడు.మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు. సినిమాకు సామ్ సి.ఎస్. సంగీతం సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్. నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే రామారావు డ్యూటీ చేశాడు కానీ..?