బీజేపీదే అధికారం.. మోదీ హ్యాట్రిక్ : ఇండియాటీవీ

దేశంలో సర్వేల కోలాహాలం నడుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్ర, రాష్ట్రాలలో ఏపార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధానిగా మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? మూడోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎన్నికల్లో ఏయే అంశాలు ప్రభావితం చేయనున్నాయి వంటి అంశాలపై జాతీయ చానల్ ఇండియా టీవీ ‘దేశ్ కీ ఆవాజ్’ కార్యక్రమంలో ఓటర్ల అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో వివిధ పార్టీలు గతంలో సాధించిన సీట్లు.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచేందుకు అవకాశం ఉందో వంటి వివరాలను వెల్లడించింది.

ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ సారథ్యంలోని ఏన్డీఎ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. 543 లోక్‌సభ స్థానాలకు గాను 362 స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకుంటుందని.. అందులో 326 సీట్లు బీజేపీకి దక్కుతాయని తెలిపింది. అదే సమయంలో యూపీకి 97 సీట్లు రావొచ్చని.. ఇందులో 39 సీట్లు రాహుల్ ఖాతాలోకి.. 25 సీట్లు స్టాలిన్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు పేర్కొంది.మిగిలిన 84 స్థానాల్లో.. తృణమూల్ కాంగ్రెస్(మమతాబెనర్జీ) 26, శరద్ పవార్(ఎన్సీపీ) 6 అఖిలేష్ యాదవ్(ఎస్పీ)2 కేజ్రీవాల్(ఆప్)5KCR(టీఆర్ఎస్)8 సీట్లు గెలుచుకునే అవకాశమున్నట్లు ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది.

మోడీ ఆర్థిక నిర్వహణ భేష్..

మోడీ ఆర్థిక నిర్వహణ పై 41 శాతం మంది ఆమోదయోగ్యం తెలిపినట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. 24% మంది నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, 27% మంది కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్లు  అంగీకరించారని సర్వే  తేలింది.

తెలంగాణలో పెరిగిన బీజేపీ బలం..
తెలంగాణలో టీఆర్ఎస్ ఓట్ల శాతం 2019 కంటే భారీ తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ టీఆర్ఎస్ 8 సీట్లు గెలిచేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. బీజేపీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగినట్లు .. 2019 లో 4 సీట్లు గెలిచిన ఆపార్టీ ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 6 సీట్లు.. కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకునేందుకు అస్కారం ఉందని తెలిపింది.

ఉత్తరాఖండ్‌లో , హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 76 సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపింది.అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పరికి 2 సీట్లు.. కాంగ్రెస్ 2 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.

పంజాబ్లో అధికార ఆప్ పార్టీ 7 ,ఎన్డీఏ 3, యూపీఏ 3 సీట్లు గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. హర్యానాలో.. మొత్తం 10 సీట్లకు గాను BJP 9, కాంగ్రెస్ 1 గెలిచేఅవకాశమున్నట్లు వెల్లడించింది.

ఇక ఒడిశాలో బీజేపీ బలం 8 సీట్ల నుంచి 11 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. ఎన్డీయే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికకావడంతో ఈమార్పు వచ్చినట్లు సర్వే తెలిపింది. నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడికి 8, బీజేపీకి 11, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకునే అవకాశమున్నట్లు సర్వేలో తేలింది. బీహార్లో 40 సీట్లకు గాను బీజేపీకి 21 సీట్లు గెలుస్తుందని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది.మొత్తం 11 స్థానాలకు గాను 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్‌కు ఒకటి వస్తుందని ఇండియా టీవీ సర్వే చెబుతోంది. 

కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం జార్ఖండ్ లో ఆపార్టీకి 1 సీటు మాత్రమే వస్తుందని షాకింగ్ రిపోర్డ్ ఇచ్చింది. బీజేపీ అక్కడ 13 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తెలిపింది. గోవాలోనూ రెండు సీట్లను బీజేపీ గెలిచే అవకాశముందని అంచనా వేసింది.