మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!

సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క-సారక్క జాతర,మేడారం సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క సారక్క 1900,సమ్మక్క సారక్క అసలు కథ,సమ్మక్క సారక్క చరిత్ర,సమ్మక్క సారక్క జీవిత చరిత్ర,మేడారం సమ్మక్క సారాక్క,కోయ వల దేవుడు సమ్మక్క సారక్క,సమ్మక్క సారక్క పసుపు కుంకుమ,మేడారం సమ్మక్క సారక్క చరిత్ర,

Sammakkasarakka:     13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న  ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు.  విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో  మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది.  దీంతో రాజ్య సంరక్షణ కోసం పగిడిద్ద రాజు గిరిజన వీరుల్ని తయారు చేసి మేడారం పెట్టని కోటలా మారుస్తాడు.

అదే సమయంలో( క్రీ.శ.1309లో) ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఉన్న నపుంసక బానిస, సేనాధిపతి అయిన మాలిక్ కాఫర్ (వింధ్య పర్వతములకు దక్షిణాన ఉన్న హిందూ రాజ్యాల వినాశం.. ప్రాచీన దేవాలయాల విధ్వంసం.. లక్షలాది హిందూవుల మతమార్పిడికి కారణభూతుడు ) హిందూ రాజ్యాలపై దండెత్తుతాడు. మార్కొపోలో చైనా నుండి తిరిగి వెళుతూ దక్షిణ భారతదేశం సందర్శించి భర్తను కోల్పొయిన వీరనారి రాణిరుద్రమ గురించి ఆమె సంరక్షణలో ఉన్న కాకతీయ సామ్రాజ్య సిరిసంపదల గురించి కీర్తిస్తూ రాస్తాడు. విషయం తెలుసుకున్న కాపర్ కాకతీయ సామ్రాజ్యాన్ని వశం చేసుకోవాలని కుట్ర పన్నతాడు.

కాపర్ వచ్చే సమయానికి ప్రతాపరుద్రుడు కాకతీయ రాజ్యాధికారం చేపడతాడు. దేవరగిరి మీదుగా పయనించి కాఫర్ సిరిపూర కోటను స్వాధీనం చేసుకుంటాడు.  అక్కడి నుంచి సమీప కాకతీయ రాజ్యంలోని మేడారం పైకి దండెత్తుతాడు. మహిళలు,పిల్లలు, ముసలివారు అన్న తేడా లేకుండా నరసంహారం చేస్తాడు. సైనికులు స్త్రీలపై అత్యాచారాలు చేస్తారు.

సమ్మక్క –  సారక్క వీరోచిత పోరాటం; 

కాఫర్ మారణహోమంపై పడిగిద్ద రాజు , సమ్మక్క సారక్క ,నాగమ్మ, జంపన్న ,గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుంచి కాఫర్ సైన్యంపై గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభిస్తారు.  కానీ దురాక్రమణ దారులు అయిన ముస్లీం సేనల ధాటికి పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. దీంతో తన వాళ్ల మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు.  అప్పటినుంచి ఆవాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మరోవైపు సమ్మక్క వీరోచిత పోరాట పటిమతో కాఫర్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ఆమె యుద్ధ నైపుణ్యానికి కాఫర్ ఆశ్చర్యానికి లోనవుతాడు. చివరికి శత్రువులు దొంగ దెబ్బ తీయడంతో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతో యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళ్తూ మార్గం మధ్యలో అదృశ్యమవుతుంది. ఆమె వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు జాడ కనిపించకుపోగా .. ఓపుట్ట దగ్గర పసుపు, కుంకుమల గల భరిణె లభిస్తుంది.

” కాకతీయ రాజ్య సంరక్షణ కోసం అసువులు బాసిన సమ్మక్క- సారలక్కలను శక్తి స్వరూపాలుగా భావించి ప్రతాపరుద్రుడు గిరిజనులతో కలిసి పూజలు జరిపిస్తాడు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క జన్మించిన మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ” 

(ప్రాచుర్యంలో ఉన్న కథ)