Lovetrap: ‘ లవ్ ట్రాప్ ‘ వినడానికి కొత్తగా అనిపిస్తుందా? అవును మీరు విన్నది అక్షరాల నిజం! అందరూ ‘ హనీట్రాప్ గురించి ‘ విని ఉంటారు కానీ.. ‘ లవ్ ట్రాప్ ‘ అనేది నేటి సమాజంలో ట్రెండ్. ప్రేమ పేరిట ఒకరిని లేదా ఇద్దరినీ ప్రేమించడం.. వారి మనసులతో ఆడుకోవడం..నిజం బయట పడ్డాక..నీకు నాకు బ్రేకప్ అంటూ విడిపోవడం పరిపాటిగా మారింది. అలాంటి ఘటనే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఓ అమ్మాయి నడిపిన లవ్ ట్రాప్ దెబ్బకు ముగ్గురు యువకులు బలయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయి ఒకేసారి ఇద్దరు స్నేహితులతో ప్రేమాయణం నడిపింది. నువ్వే నా ప్రాణం అంటూ ఇద్దరు యువకులకు పీకల్లోతు ప్రేమలోకి దింపింది. ఒకరికి తెలియకుండా మరొకరితో పార్కు లు,షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేసింది. పెళ్లి చేసుకుంటానని ఇద్దరిని నమ్మించి చివరికి వారి చావుకు కారణమైంది.
ట్రైయాంగిల్ లవ్ స్టోరి ;
అనిల్ , రాహుల్ (పేర్లు మార్చాం) ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. అమ్మాయికి కూడా వీరిద్దరు లవ్ చేస్తున్న విషయం తెలుసు. అయితే ఆ అమ్మాయి మాత్రం ” నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వే నా ప్రాణం ” అంటూ ఇద్దరిని నమ్మించింది. ఒకరికి తెలియకుండ మరొకరితో కాల్స్ మాట్లాడుతూ ..ఇద్దరి స్నేహితుల మధ్య గోడవలు రాజేసింది. చినికి చినికి గాలి వానలా గోడవలు ముదరడంతో మనస్తాపం చెందిన రాహుల్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆతర్వాత నుంచి ఆ అమ్మాయి అనిల్ కి ఫోన్ చేసి .. రాహుల్ లేకుండా ఎలా బతకాలి అంటూ బాధపెట్టింది. దీంతో రాహుల్ వలే తాను మోసపోయానని గ్రహించిన అనిల్ మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు యువకుల మరణాలతో ఆ అమ్మాయి ప్రేమలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరణించిన ఇద్దరు స్నేహితులే కాకుండా మరో ముగ్గురితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు స్నేహితులు మరణించిన సమయంలోనే మరో యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ అబ్బాయి కూడా ఈఅమ్మాయి బాధితుడే అనే వార్త బయటకు వచ్చింది. మొత్తంమీద ప్రేమ ముసుగులో (లవ్ ట్రాప్) ఓ అమ్మాయిన విసిరిన ప్రేమవల యువకుల ప్రాణాలు తీసింది. వారి కుటుంబాల్లో విషాదం నింపింది.