మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ప్రత్యేకం …

మెగాస్టార్ చిరంజీవి అలియాస్ కొణిదెల చిరంజీవి.. చిత్రపరిశ్రమలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ కి మెగాస్టార్ అయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమకు తనదైన స్టేప్పులతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన మెగాస్టార్.. తనదైన మాస్ యాక్షన్ ,కామెడీ టైమింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాందించుకున్నారు.

చిరంజీవి 1955 ఆగస్ట్ 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆతర్వాత హీరోగా నటించి.. తనదైన స్టేప్పులతో కుర్రకారును ఉర్రుతలూగించారు.

మెగాస్టార్ నటించిన తొలిచిత్రం పునాది రాళ్లు. అయితే ఆసినిమా కంటే ముందు తన నటించిన ప్రాణం ఖరీదు మూవీ విడుదల కావడం బ్లాక్ బస్టర్ కొట్టింది.తర్వాత వచ్చిన స్వయం కృషి చిత్రం ఆయన కెరీర్‏ కి టర్నీంగ్ పాయింట్. శుభలేఖ, ఖైదీ, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, కొండవీటి రాజా, రాక్షసుడు, రుద్రవీణ, చంటబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

కెరీర్ తొలినాళ్లలో అభిమానులు చిరంజీవిని సుప్రీం హీరోగా పిలిచేవారు.. అనంతరం అతను నటించిన మరణ మృదంగ సినిమా తర్వాత నిర్మాత కేఎస్ రామారావు చిరుకు మెగాస్టార్ బిరుదు ఇచ్చారు. ఓవైపు సినిమాలు చేస్తునే .. సేవా కార్యక్రమాలపై చిరంజీవి దృష్టి సారించారు.

1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. ఆ తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ట్రస్టులను ప్రారంభించారు. ఇక 2008 ఆగస్ట్ 26న స్వయంగా ప్రజారాజ్యం అనే పార్టీని ఆవిష్కరించి రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటి చేయగా కేవలం 18 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ..2013 లో ఖైదీ 150 సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు చిరు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వెండితెరపై సందడి చేసిన మెగాస్టార్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు.

 

Optimized by Optimole