Mirchi:
బతుకమ్మ అంటేనే పాటల పండగ. ఆటల వేడుక. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్చి తెలుగు వినూత్నరీతిలో బతుకమ్మ ర్యాప్ సాంగ్ విడుదల చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రకరకాల పూలు, బతుకమ్మ ప్రత్యేకత, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ సమయంలో ఉండే అనుబంధాలను కలపోతగా ఈ పాటను రూపొందించారు.
మోడ్రన్ మ్యూజిక్, తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటను మిర్చి స్వాతితో ఫ్లవర్ మార్కెట్ లో చిత్రీకరించారు. కాగా, ఈ పాటను సద్దుల బతుకమ్మ నాడు ప్రముఖ యాంకర్, నటి సుమా కనకాల విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ…‘‘ మిర్చి అందరికంటే భిన్నంగా ఆలోచిస్తుంది. అలాగే రొటీన్ కి భిన్నంగా బతుకమ్మపై ర్యాప్ సాంగ్ చేయడం ఆకట్టుకుందని, యూత్ కి కనెక్ట్ అయ్యేలా రూపొందించిన మిర్చి తెలుగు టీంని ఆమె అభినందించారు.
ఈ పాటకు గణేశ్ తండ లిరిక్స్ రాయగా, చిన్మాయనంద యాలకంటి పండగ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఎనర్జిటిక్ సంగీతం అందించారు. స్వాతి తన గాత్రంతో లిరిక్స్ కి ప్రాణం పోయడంతో పాటు అద్భుతంగా నటించారు. మోహన్ కె రాజ్ స్పెషల్ అప్పియరెన్స్ తో ఆకట్టుకున్నారు. వాణి మాధవి అవసరాల దర్శకత్వం వహించిన ఈ బతుకమ్మ పాటకు కశ్యప్ దత్తా సినిమాటోగ్రఫర్, ఎడిటర్ గా పని చేశారు. ఐశ్వర్య లైన్ ప్రొడక్షన్ చేశారు. ఈ పాటను మిర్చి తెలుగు యూ ట్యూబ్ చానెల్, మిర్చి తెలుగు ఇన్ స్టాగ్రాం పేజీల్లో చూడొచ్చు.