ఎమ్మెల్సీకవిత: మామునూరు విమానాశ్రయానికి రాణి రుద్రమ పేరు పెట్టాలి

Hyderabad: మామునూరు విమానాశ్రయానికి కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరు  పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రుద్రమదేవి లాంటి వీరనారిని గౌరవించాలంటే విమానాశ్రయానికి ఆమె పేరును తప్పక పెట్టాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు.

ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత, ‘‘తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదు. అందుకే రాహుల్ గాంధీని వరంగల్‌కు తీసుకువచ్చి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో మొదటి హామీ రైతు రుణమాఫీ అని చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి నేను ఒక ఛాలెంజ్ వేస్తున్నాను.. కనీసం 50 శాతం రైతులకు అయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశారా?’’ అని నిలదీశారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నష్టపోయిన మిర్చి రైతులకు ఢిల్లీకి వెళ్లి న్యాయం చేయగలిగారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా తటస్థంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి వారి సమస్యలపై కృషి చేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Optimized by Optimole