Telangana: డాడీ ఆశీర్వాదం కోసం..?

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి ఆశీర్వాదం కోసం మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో కలవబోతున్నారన్న వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కొడుకు పేరిట తెలంగాణ జాగృతి కమిటీల ఏర్పాటు ప్రకటించిన మరుసటి రోజే ఈ భేటీ జరగనుండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్ వర్గాల చర్చల ప్రకారం, ఇటీవల కవిత తెలంగాణ జాగృతి పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి పెద్దగా సక్సెస్ కాలేదు. తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా సక్సెస్ కావడం కష్టతరమని భావించిన కవిత, ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ భేటీ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఈ భేటీలో గతంలో కేసీఆర్‌కి ఆమె రాసిన లేఖ లీక్ కావడం.. ఆగ్రహంతో “తండ్రి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి” అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే విధంగా, రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ – కవిత మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Optimized by Optimole