దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని ఒంకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా కరోనాతో సినిమా ఇండస్ట్రీలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని, పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ ఆర్ చిత్రంలో టాలీవుడ్ అగ్రహీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. వారి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఇంగ్లీష్ మామ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. చిత్రం విడుదల కి సంబంధించి విడుదలైన పోస్టర్ తో సినిమాపై భారీ అంచనలున్నాయి. తాజా విమర్శల నేపథ్యంలో రాజమౌళి బృందం ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.