ఓటరు మహశయులారా..! ఎవరు అవునన్నా..కాధన్నా..ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎన్నికలు రాజ్యాంగ వ్యవస్థ కు లోబడి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిందే.ప్రజల ఆకాంక్షలు,విశ్వాసాల మేరకే నియమిత కాలానికి ప్రభుత్వాలు ఏర్పడతాయి.రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.మీరు ఎన్నుకున్నవారు సరిగా పనిచేయడం లేదని బావించినప్పుడు మీదే అంతిమ నిర్ణయాధికారం.శాసన కర్తల అంతిమ లక్ష్యం సుపరిపాలన.అనాటి కాలంలోనే అరిస్టాటిల్”వ్యక్తుల పాలన కన్నా చట్టాల పాలన శ్రేష్టమైనది” అని చెప్పారు.కాబట్టి ప్రభుత్వాల ఏర్పాటు, ఎన్నికలు,నిర్మాణం,నిర్వాహణ అంతిమ లక్ష్యం “ప్రజా విశ్వాసం” మేరకే నడవాలి.అన్ని వర్గాల ప్రజల సమ్మతితో ఏర్పడిన ప్రభుత్వాలు “ప్రజల” కేంద్రం గా గాకుండా కొంతమంది “వ్యక్తుల”కేంద్రం గా నడుస్తున్నాయి,వ్యక్తిగత ఆకాంక్ష ల కోసం నడుస్తున్నాయి,వ్యక్తి కోరిక మేరకు అసందర్భమైన/అనవసరమైన ఎన్నికలు వస్తున్నాయి.అందులో భాగమే మన మునుగోడు ఉప ఎన్నిక.ఈ దేశంలో సాధారణ ఎన్నికలు(ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేవి),మధ్యంతర ఎన్నికలు(ప్రభుత్వం అర్థాంతరంగా రద్దైతే),ఉప ఎన్నికలని మూడు స్థాయిలలో ఎన్నికలు జరుగుతుంటాయి.”ఉప ఎన్నిక”అంటే ఏదైనా నియోజకవర్గ ప్రజాప్రతినిధి మరణీంచి ఖాళీ ఏర్పడితనో,ప్రజల ఒత్తిడి మేరకో రాజీనామా చేస్తనో వచ్చేది…
గత ఉప ఎన్నికల నేపథ్యం:—
———————
2018 సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ లో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక లో రామలింగారెడ్డి మరణించినప్పుడు,నాగార్జున సాగర్ లో నోముల నర్సింహ్మయ్య గారు మరణించినప్పుడు, హుజూర్ నగర్ ఎమ్యేల శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎంపిగా పోటి చేసినప్పుడు, హుజురాబాద్ ఎమ్యేలే ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చినక్రమంలో రాజీనామా చేసినప్పుడు,ఇంధులో రెండు ఉప ఎన్నికలు సహజ మరణాల ద్వారా వచ్చినవే.హుజూర్ నగర్ ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధమే.ఆల్రెడీ ఎమ్యేలే గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ని రాజీనామా చేయించి ఎంపి గా బరిలో నిలబెట్టడమంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మూర్ఖపు పనే.ఎంపి అభ్యర్థి గా మరొకరికి అవకాశం ఇచ్చి ఉంటే హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చేది కాదు. వంధల కోట్ల ప్రజాధనం వృధా అయ్యేది కాదు.మరొక ఉప ఎన్నిక హుజురాబాద్. ఇక్కడ హుజురాబాద్ ఎమ్యేలేకు కేసీఆర్ కు మధ్యన వచ్చిన వైరం ప్రజా క్షేత్రం లో తేలుసుకునేలా చేసింది.సదరు ఎమ్యేల భూ కబ్జాలకు పాల్పాడ్డాడనే ఆరోపణలు వచ్చిన పరిస్థితి. ఈ సమయంలో నే పెద్ద ఎత్తున ఆ ఏమ్యేలేకు ప్రజాధరణ లభించింది.ఈ సందర్భంలో తన ఆత్మగౌరవం పై దాడి జరిగినది గా బావించి తె.రా.స కు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బాజాపా లోకి పోయిన పరిస్థితి.ఇక్కడే పౌర సమాజం నుంచి తలెత్తిన ప్రశ్న ఏమిటంటే నిజంగా ఆ ఎమ్యేలే ఆత్మగౌరవాన్నికే భంగం కలిగి ఉంటే జనం నుంచి వచ్చిన ఆదరణను మలుసుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆత్మగౌరవ జెండా ఎగిరేసి ఉండవచ్చు కధా.! పార్టీ లతో ఏమి పని.? ఉధ్యమ నాయకునివే కధా.!రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజా వ్యతిరేక విధానాల పై ప్రజలను చైతన్యం చేసి ఉధ్యమానికి శ్రీకారం చుట్టిఉండవచ్చు కధా.! అంటే రాజేందర్ అది చేయలేదు.అంటే తనకున్న విలువలను సైతం ఆస్థుల రక్షణ కోసం మరో అధికార పార్టీకి అమ్ముకున్నాడనే అపవాదం ఆ ఏమ్యేలే పై లేకపోలేదు.
మునుగోడు ఉప ఎన్నిక ఎందు కోసం.?
————————-
తెలంగాణలో వచ్చిన మరో ఐదో ఉప ఎన్నిక మునుగోడు.ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ఏమ్యేలే రాజగోపాల్ రెడ్డి తన పదవి కాలం పూర్తి కాకముంధే రాజీనామా చేసారు..బిజెపి లోకి పోయారు.రాజగోపాల్ రెడ్డి మాత్రం
మునుగోడు అభివృద్ధి కోసమే,మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేసానంటున్నారు..
రాజీనామా లేఖలో దేనికి చేసాడో చెప్పాడా.! అంటే లేదు..నా రాజీనామా తోనే అభివృద్ధి జరుగుతుంధని ప్రజలకు హితభోధన చేస్తున్న పరిస్థితి..రాజీనామా చేసిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటి చేస్తే అధికార పార్టీ అభివృద్ధి చేయాలనుకుంటే చేయకపోవునా..!
రాజగోపాల్ రెడ్డి తోపాటు భట్టి విక్రమార్క, సీతక్క లాంటి మరికొంతమంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నరు కధా.! వారి నియోజకవర్గాలలో “మునుగోడు”నియోజకవర్గం కంటే ఏమైనా అధనంగా అభివృద్ధి జరిగింధా.!
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో జరిగిన అదనపు అభివృద్ధి ఏమిటి.? రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఏమిటి.?
మీతోటి సహచర ఏమ్యేలే లు కూడా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసిరు కధా.! మీరు కూడ మునుగోడు అభివృద్ధి పై రాష్ట్ర సమస్యల పై నిలదీసినరు కధా..! ప్రతిపక్ష పార్టీ బాధ్యులు గా అభివృద్ధి పై ప్రశ్నించాల్సింధే కధా..! అభివృద్ధి ని ఎవరు కాదనలేము కధా…! కాని మునుగోడు నియోజకవర్గం కంటే భిన్నంగా బిజెపి నియోజకవర్గ ఎమ్యేలే లు ఉన్న ప్రాంతాలైన గోషామహల్,దుబ్బాక,హుజురాబాద్,
మరియు బిజెపి పార్లమెంట్ స్థానాలైన నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, అదిలాబాద్ స్థానాలలో ఏమైనా అభివృద్ధి ఏరులై పారింధా..!
ఉప ఎన్నిక ద్వారా అభివృద్ధి జరుగుతుంధా.!
—————————–
ఈ ఉప ఎన్నిక ద్వారానే అభివృద్ధి జరుగుతుంధా.! గతంలో అలా ఏమైనా జరిగినధా.!
వాస్తవం గా మును”గోడు” కు వచ్చిన ఉప ఎన్నిక అనేది ప్రజల కోరుకుంటెనో,వారి గోడు చెప్పుకోవడానికో,వారి అభివృద్ధి కోసమో వచ్చిన ఉప ఎన్నికనా..!
కాదనేది సత్యం..ఎంధుకంటే అక్కడి ఏమ్యేలే ని ప్రజలు మాకోసం రాజీనామా చేయండి..మీరు రాజీనామా తో మునుగోడు అభివృద్ధి జరుగుతదని పోరాటాలు చెయ్యలే కధా.! నియోజకవర్గానికి రావద్దని నిలబడి సదరు ఎమ్మెల్యేను నిలదీయలే కదా.! ఆయన చెపుతున్నట్లు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే ఈ రాష్ట్రంలో బిజెపి ఐనా,కాంగ్రెస్ ఐనా రెండు ప్రతిపక్ష పార్టీ లే కధా.! కాంగ్రెస్ లో ఉంటే జరగని అభివృద్ధి బిజెపి లోకి పోతే జరుగుతుంధా.! ఒక వేళ బిజెపి లో చేరితే నే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ఈటెల రాజేందర్ బిజెపి లో చేరి ఎమ్యేలే ఐన తర్వాత హుజురాబాద్ లో ఏమైనా అధనంగా అభివృద్ధి జరిగింధా.! హుజురాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ గాని,దుబ్బాక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రఘునందన్ గాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి ఏమైనా అదనంగా నిధులు తీసుకొచ్చారా..! అంటే అదనపు నిధులు ఏమి లేవు,అదనపు అభివృద్ధి ఏమి జరగలేదనేది సత్యం..
నాడు లేని ఆరాటం..నేడు ఎంధుకు.?
————————-
మునుగోడు ఎమ్మెల్యే ఐనకానుంచి ఎన్నిసార్లు తన నియోజకవర్గ ప్రజల దగ్గర కు వచ్చిండు.? నెలకో,రెండు నెలలకో,మూడు నెలలకో ఒకసారి వచ్చి లక్షా,రెండు లక్షలు ప్రజలకు పంచి తన ఉనికి కోసం ఆర్భాటం చేయడమే తప్ప నిజంగా ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నాడా..! కనీసం తన క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తి చేయించాడా.! ఏనాడైనా ప్రజల బాధలను పట్టించుకున్నారా.! రాజీనామా చేసిన తర్వాత నిరంతరం నియోజకవర్గంలో ఎందుకు కలియ తిరుగుతున్నట్లు.? ఇదే పని అనాడు ఎంధుకు చేయలేదు.?ఎవరి ప్రయోజనాల కోసం.? ఆనాడు క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయనివారు..ఈరోజు కొత్త గా క్యాంపు కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేసినట్లు.?
తను రాజీనామా చేసిన మూడు నెలలో అధనంగా జరిగిన అభివృద్ధి ఏమిటి..? ఏమిలేదు.తెలంగాణ లో మునుగోడు కు జరుగబోయే ఉప ఎన్నిక వ్యక్తి స్వార్థం కోసం వచ్చిన ఉప ఎన్నిక మాత్రమే..బిజెపి ఎత్తుగడలో భాగంగా వచ్చిన ఎన్నిక మాత్రంగానే తెలంగాణ సమాజం బావిస్తుంది..
కోట్ల రూపాయల తో ధర్మ యుద్దమా.!
——————–—
ఈ ఎన్నికల ప్రచారంలో కోట్లాది రూపాయలు పట్టబడిన వరుసలో ప్రధమంజలో ఉన్న అభ్యర్థి కూడా ఈ ఉప ఎన్నిక అనే ధర్మ యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని ప్రగల్భాలు పలుకుతున్న దుస్థితి.మునుగోడు కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధి కి కేటాయించిన నిధుల కంటే కూడా సదరు అభ్యర్థి చేస్తున్న ఖర్చు కోట్లలో ఉంది.నిజంగా మునుగోడు నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేయకుండా,స్థానిక ప్రజా ప్రతినిధులను కొనకుండా మునుగోడు అభివృద్ధి కోసం ఖర్చు చేసి ఉండవచ్చు కధా.!అనవసరంగా రాజీనామా చేసి మా కొంపలు ఈ ఉప ఎన్నికలు ఆగం చేస్తున్నాయని మహిళలు లబోదిబోమంటున్న పరిస్థితి..
మునుగోడు అభివృద్ధి పై చర్చ ఎక్కడ.?
———————–
ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటర్లను ఆకట్టుకోవడానికి “మమ్ములను గెలిపిస్తే” అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతదని అధికార పార్టీ చెపుతున్న పరిస్థితి.మరొక జాతీయ పార్టీ నుంచి పోటిచేస్తున్న అభ్యర్థమో ప్రజలకు ఏమి అభివృద్ధి చేస్తడో చెప్పకుండా “కుటుంబ పాలనను”అంతం చేయడమే నా ధ్యేయం అంటున్నాడు.కాని ఏ పార్టీ కూడా వాళ్ల సమస్యల గురించి గాని,వాళ్ళ ఆకాంక్షల గురించి గాని అడగడం లేదు.గ్రామాలలో ప్రజలు తాగునీటి సమస్య గురించి గాని,రోడ్ల అధ్వాన్నపరిస్థితుల గురించి గాని, చదువుకున్న వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఏమి కల్పిస్తారో అనే దాని గురించి గాని,వాళ్ళ జీవనోపాధి గురించి గాని,అక్కడి భూ నిర్వాసితుల పరిహారం గురించి గాని,పోడు భూముల సమస్య గురించి గాని ఆ ప్రాంత అభివృద్ధి గురించి గాని చర్చ లేదు.ప్రధాన పార్టీలకు మ్యానిఫెస్టో నే లేదు.ప్రజలలో చర్చ అంతా కూడా ఏ పార్టీ ఓటుకు ఎంత ఇస్తుంది..? ఎవరు ఎక్కువ మొత్తంలో ఇస్తారు.? అనే విషయంపైనే చర్చ జరుగుతుంది..ఇంధుకోసమేనా ఉప ఎన్నిక.?
ప్రజాస్వామ్యమా.! ధనస్వామ్యమా.!
———————–
అత్యధిక సంఖ్యలో ఉన్న సామాజిక శక్తుల కు సీటు ఇవ్వకుండా సామాజిక,ఆర్ధిక నేరాల్లో భాగస్వామ్యం ఐన వ్యక్తులను అడ్డం పెట్టుకొని పార్టీ ని విస్తరింపచేసుకోవాలనే కుట్రకు తెరలేపినదే మునుగోడు ఉప ఎన్నిక..ధనస్వామ్యం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అనేక కమీషన్లు,కమిటీ లు ఏర్పడ్డాయి.వాటి సిఫార్సులను తుంగలో తొక్కి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని,తమ పట్ల వివక్షత కొనసాగిస్తుందని ప్రజల ఎజెండా అమలు కావడం లేదని కొంతమంది రాజకీయ టూరిస్టులు అవాకులు చవాకులు పేలుస్తున్నారు.అంతటితో ఆగకుండా పాలనా అనుభవం లేని అసమర్థులు భూబకాసురులను ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టి అంతిమంగా ఎన్నికల్లో గెలిస్తే మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తారనే భ్రమలో ప్రజలను ఉంచుతున్నారు.నియమిత కాలం పూర్తి కాకుండానే అర్ధాంతరంగా రాజీనామా చేయడం దేనికి సంకేతం..? ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు దేనికీ సంకేతంగా తీసుకోవాలి..? ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వక్ర మార్గాలను ఎంచుకొని మంధబలంతో , ఆర్ధిక బలంతో తొడేళ్ళ మాదిరిగా నియోజకవర్గం లోని గ్రామాలపై పడి పచ్చని అనుబంధం ఆత్మీయత పెనువేసుకున్న ప్రజల మధ్య విద్వేషాలు,వర్గ,కుల,మత స్వభావాన్ని పెంచి రాజకీయ లబ్ధి కోసం నానాతంటాలు పడుతున్నారు.ఎప్పుడు గూడాలు,తండాలు , వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోని డిల్లీ నుండి గల్లీ దాకా ఉండిన ఖద్దరు వస్త్రాల నాయకులు, ఆద్యాత్మిక చింతన పేరిట శిబిరాలు ఏర్పాటు చేసి ఆర కొర గా చదివిన జ్ఞానం తో మతిస్థిమితం లేని బాష ఉచ్ఛారణ తో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.లాభాపేక్ష లేకుండా అభివృద్ధి అనే పదం ముందుకు తీసుకునే పరిస్థితి లేదు.ప్రజలకు నేటి రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల మీద నమ్మకం సన్నగిల్లింది.
మునుగోడు ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..
———————–
కావునా బుద్ధి జీవులు ఈ రాజీనామాల వలన కలిగే అనర్ధాలను గురించి,ప్రజా ధనం దుర్వినియోగం గురించి, ఎన్నికలలో అనుసరించాల్సిన గుణాత్మకమైన మార్పుల గూర్చి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది.రాజకీయ పార్టీ లు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణ,గణాలు , వ్యక్తిగత విలువలు,నేర స్వభావం లేని వ్యక్తులను, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ కు విఘాతం కలిగించని వ్యక్తులను నిలబెట్టడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ ఫరిఢవిల్లుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పౌరసమాజం విశ్వసిస్తుంది, ఆ వైపుగా మునుగోడు ప్రజలు ఆలోచన చేస్తారని ఆశిస్తుంది…
===============
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
నల్లగొండ జిల్లా అధ్యక్షులు