‘ నా సామి రంగ రివ్యూ’..హిట్టా ? ఫట్టా?

Naasaamirangareview: కింగ్ అక్కినేని నాగార్జున, యువ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించిన తాజా మల్టీస్టారర్     ‘ నా సామి రంగ ‘. ఆషిక రంగనాథ్, మర్నామీనన్ , రుక్సర్ ధిల్లాన్ కథానాయికలు. విజయ్ బిన్ని దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…!

కథ: 

1960 దశకంలో తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రెసిడెంట్ పెద్దయ్య( నాజర్) ను ఓ ప్రమాదం నుంచి ఇద్దరు అనాథ బాలలు కిష్టయ్య ( నాగార్జున) ,అంజి( అల్లరి నరేష్) కాపాడతారు.  అప్పటినుంచి కిష్టయ్యను తన కొడుకుల్లో ఒకడిగా పెద్దయ్య  పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే  కిష్టయ్య, వరాలు ( ఆషికా రంగనాథ్) ప్రేమించుకుంటారు. అయితే వరాలు  తండ్రి వరద రాజులు ( రావు రమేష్) ఆమెను పెద్దయ్య కొడుకు దాసు( షబ్బీర్ కాళ్ల రక్కల్)కి ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వెళ్తాడు. మరోవైపు పొరుగూరు జగన్న పేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారి ( రుక్సార్) అంబాజీ పేట కుర్రాడు భాస్కర్ ( రాజ్ తరుణ్) తో ప్రేమలో పడుతుంది. కిష్టయ్య_ వరాలు ప్రేమ కథ తెలిసిన పెద్దయ్య ఏం చేశాడు? వీళ్లిద్దరి ప్రేమకు  వరాలు తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? భాస్కర్_ కుమారి ప్రేమ వ్యవహరం వలన రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే…!

విశ్లేషణ: 

పల్లెటూరి నేపథ్యంలో టాలీవుడ్ లో అనేక సినిమాలు వచ్చాయి. ‘ నా సామి రంగ ‘ చిత్రం అదే కోవకు చెందింది. ‘ సోగ్గాడే చిన్నినాయన’ ‘ బంగార్రాజు’ సినిమాల్లో క్యారెక్టర్ మాదిరి ఈ చిత్రంలోనూ నాగార్జున గోదావరి యాసలో పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఆయనకు ధీటుగా అల్లరి నరేష్ అద్భుతంగా నటించాడు. మొత్తంగా ఫస్ట్ ఆఫ్ ఒకే అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ పర్వాలేదు.

ఎవరెలా చేశారంటే..?

కింగ్ నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అందం, అభినయం పరంగా ఆషిక ఆకట్టుకుంది. రుక్సార్, మర్నామీనన్ ఉన్నంతలో బాగానే నటించారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

నిపుణుల పనితీరు: 

డైరెక్టర్ విజయ బిన్నీ ఫస్ట్ సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు మాదిరి సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. పాత్రలకు తగ్గట్టు నటీనటుల ఎంపిక దగ్గరే డైరెక్టర్ సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. సినిమాలో అక్కడక్కడ వచ్చే కొన్ని సన్నివేశాలు చిరాకు తెప్పిస్తాయి. కీరవాణి సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత ఖర్చు తెరపై కనిపిస్తోంది.

” చివరగా ఒక్క మాటలో.. ‘ నా సామి రంగ’ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్..”

రివ్యూ: 3/5( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)