పాదయాత్రలో జగన్ పై లోకేష్ సెటైర్లు..

కుప్పం: ‘యువగళం ‘ రెండో రోజు పాదయాత్రలో భాగంగా నారా లోకేష్..సీఎం జగన్ పై సెటైర్లు పేల్చాడు. పెట్రోల్, డీజిల్ పై పన్ను బాదుడు లో ఏపి నంబర్1 స్ధానంలో ఉందన్న లోకేష్.. ఏపి కంటే కర్ణాటక లో క్వార్టర్ బాటిల్ 100 రూపాయిలు తక్కువన్నారు.విషం కంటే ప్రమాదకరమైన జగన్ లిక్కర్ తాగితే డైరెక్ట్ పైకి పోవడమేనని ఎద్దేవ చేశారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో .. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇక పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ని బాబు నగర్ స్థానికుల కలిశారు. గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నట్లు.. టిడిపి హయాంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించినా.. సగం పూర్తి అయ్యే సరికి ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు అగిపోయినట్లు గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారం వచ్చిన 100 రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

“త‌ల్లిదండ్రుల్లా ఆద‌రించి`నారా`కుటుంబం..
నీడై..భ‌విత‌కు తోడై నిలిచిన ఎన్టీఆర్ స్కూల్‌..”

ఇదిలా ఉంటే.. పై ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు న‌వీన్. అతని స్వస్థలం శాంతిపురం.చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అన్నా వ‌ల్ల‌మాలిన అభిమానం చూపే న‌వీన్ తండ్రి పేరు కూడా చంద్ర‌బాబే. హ‌ఠాత్తుగా తండ్రి చ‌నిపోవ‌డంతో న‌వీన్ జీవితం అగ‌మ్య‌గోచ‌ర‌మైంది. అప్పుడే కారుచీక‌ట్లో కాంతిపుంజంలా తెలుగుదేశం పార్టీ క‌నిపించింది. నవీన్ ఎన్టీఆర్ స్కూలులో ఉచితంగా విద్యాభ్యాసం పూర్తిచేసే అవ‌కాశం చంద్ర‌బాబు క‌ల్పించారు. 2010 నుండి 2015 వరకూ ఎన్టీఆర్ స్కూలులో చదువుకున్న న‌వీన్, ఆ త‌రువాత బీటెక్ పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు సాయమందించాడు. ఇప్పుడు న‌వీన్ బెంగ‌ళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. త‌న‌కు తండ్రిలా ఆద‌రించి చ‌దివించిన చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ని క‌లిసి ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు. చ‌దువు, ఉద్యోగం, భ‌విష్య‌త్తు అంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చిందేనంటూ యువ‌గ‌ళం వినిపించాడు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole