ఇలా బ్రిడ్జి ప్రారంభించారు .. అలా కూలిపోయింది.. వీడియో వైరల్

ఎన్నో ఏళ్ల తమ పోరాటం ఫలించబోతుందని ఆఊరి గ్రామ ప్రజలు ఆనందంతో ఉన్నారు. కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు.సీన్ కట్ చేస్తే అధికారులు వంతెనను ప్రారంభోత్సవానికి అలా రిబ్బన్ కట్ చేశారో లేదో ఇలా కూలిపోయింది.దాంతో అక్కడి ప్రజలు..ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఈఘటన ఎక్కడ జరిగిందంటే..?

వివరాల్లోకి వెళితే ..డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఒక వంతెనను ప్రారంభించేందుకు అధికారులు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఈ చిన్న వంతెనను నిర్మించారు. వంతెనకు ముందు ఉన్న తాత్కాలిక నిర్మాణం తరచుగా విరిగిపోయేదని..ఈక్రమంలోనే మరోసారి కొత్తగా బ్రడ్జిని నిర్మించామని అక్కడి అధికారులు అంతర్జాతీయ వార్త సంస్థకు తెలిపారు.

వంతెన కూలిపోవడంపై ప్రజలు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు.తమ వంతెన ఆశలు ఆవిరైనట్టేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ..బ్రిడ్జి కూలిపోతుందని తెలిసిన అధికారులు చీఫ్ గెస్ట్ మహిళ అధికారిని ముందే అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దాంతో ఆమెతో పాటు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈఘటన అంతా అక్కడి మీడియా, స్థానికులు ఫోటోలు, వీడియోలు తీశారు. దాంతో ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.