హీరో నాగ్ కంటతడి.. ఒకే ఒక జీవితం మూవీపై ప్రశంసలు..!!

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరో శర్వానంద్. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ తనదైన యాక్టింగ్ తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు.తాజాగా శర్వ నటించిన ‘ఒకే ఒక జీవితం ‘శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో అక్కినేని నాగార్జున, అఖిల్‌, అమలాతో పాటు దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక ప్రీమియరో షో అనంతరం నాగార్జున, అఖిల్ భావోద్వేగానికి గురయ్యారు.ముఖ్యంగా అఖిల్..శర్వాను గట్టిగా హత్తుకొని అభినందించారు. తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుందని దర్శకుడిని కొనియాడారు. సినిమా అద్భుతంగా ఉందని నాగ్ ప్రశంసలు కురిపించారు.శర్వా నటన చించేశాడని అభినందించారు. ఇక ఇటీవలే హిట్ కొట్టిన దర్శకులు హనురాఘవపూడి, చందుమొండేటి చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు.

కాగా గతంలో చేసిన తప్పులను సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ వైవిధ్య బరితంగా ఉందన్నారు సెలబ్రెటీలు.సినిమా తప్పక విజయం సాధిస్తుందని.. కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని కుండబద్దలు కొట్టారు.తల్లికొడుకుల కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు విజయం సాధించాయని ..ఈమూవీ కూడా వాటి సరసన చేరుతుందని పలువురు దర్శకులు స్పష్టం చేశారు.

Optimized by Optimole