చేజేతులా ఓడిన భారత్.. ఫైనల్ చేరేది కష్టమే..

Asiacup2022:శ్రీలంకతో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో టీంఇండింయా ఓటమిపాలైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చేతులేత్తేయడంతో ఆరు వికెట్ల తేడాతో లంకేయులు ఘనవిజయం సాధించారు . ఈఓటమితో భారత్ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించడంతో 174 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచుంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అనంతరం లంక జట్టు 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్స్ లో కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. చివరి ఓవర్లో లంక ఏడు పరుగులు చేయాల్సి ఉండగా .. తొలి నాలుగు బంతుల్లో లంక బ్యాట్స్ మెన్స్ నాలుగు పరుగులే చేశారు. అయితే ఐదో బంతి డాట్ బాల్ అయ్యి నేరుగా వెళ్లి కీపర్ పంత్ చేతుల్లో పడింది. ఈక్రమంలో బ్యాట్స్ మెన్స్ పరుగుకోసం ప్రయత్నించారు. పంత్ స్టంప్స్ పడగొట్టేందుకు బంతిని విసరగా తాకపోవడంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లోని బౌలర్ అర్షదీప్ దగ్గరికి వెళ్లింది. ఇదే అదనుగా బ్యాట్స్ మెన్స్ మరో పరుగు పూర్తి చేయడంతో భారత్ ఓటమి ఖరారైంది.