Radiomirchi: ఎంటర్టైన్ మెంట్ కి, సృజనాత్మక కార్యక్రమాలకు చిరునామా అయిన 98.3 రేడియో మిర్చి తెలుగు స్టేషన్, ఎన్నికల వేళ యువ ఓటర్లలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ‘సీసలొద్దు పైసలొద్దు’ అనే ర్యాప్ సాంగ్ ను విడుదల చేసింది. చిన్న చిన్న పదాలతో రాసిన ఈ పాట, అందరికీ అర్థమయ్యే విధంగా ఓటుకు ఉన్న శక్తిని, దానిని వృథా చేయడం వల్ల కలిగే నష్టాన్ని వివరిస్తుంది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రజాస్వామికవేత్త డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హైదరాబాద్ లో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువను తెలుపుతూనే, ఈ పాట ఓటరుకున్న బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
మనసుకు హత్తుకునేలా ఈ పాటకు చిన్మయానంద. వై బాణీతో పాటు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. గణేశ్ తండ రాసిన ఈ పాటకు ఆర్జే స్వాతి తన గాత్రంతో ప్రాణం పోశారు. ‘‘సమాజంలో మార్పు తీసుకురావడంలో సంగీతం కీలక పాత్ర పోషిస్తుందని రేడియో మిర్చి నమ్ముతుంది. అందుకే, సందర్బానుసారంగా కాల పరీక్షకు తట్టుకుని నిలబడే పాటలను నిర్మిస్తోంది. సరిహద్దులను దాటి, టీమ్ మెంబర్స్ కి అవకాశం ఇవ్వడం వల్ల ఇలాంటి అద్భుతమైన పాటలు వస్తున్నాయి’ అని మిర్చి తెలుగు కంటెంట్ లీడర్ వాణి మాధవి తెలియజేశారు. టీమ్ అంతా కలిస్తే ఎంతమంచి పాట వస్తుందో ‘సీసలొద్దు… పైసలొద్దు’ ర్యాప్ సాంగ్ ఒక ఉదాహరణ అని, సమాజానికి అవసరమైన పాటలను ఎప్పటికప్పుడు అందించడంలో మిర్చి ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటుందని మిర్చి తెలుగు బిజినెస్ డైరెక్టర్ హర్మన్ జీత్ సింగ్ పేర్కొన్నారు.
ఆడియోకి వీడియో తోడయితే…మనం ఇచ్చే సందేశం మరింత శక్తిమంతంగా మారుతుంది. మోహన్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ పాటకు, హర్షవర్థన్, ఆర్.ఎస్ సాగర్ అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. మిర్చి ఆర్జే స్వాతి, మిర్చి ఆర్జే సరన్, మిర్చి ఆర్జే అమృత, మిర్చి ఆర్జే శ్వేత తమ నటనతో ఈ పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ఈ పాటను మిర్చి తెలుగు స్టేషన్ లో వినవచ్చు. మరియు మిర్చి తెలుగు యూట్యూబ్ చానెల్ లో కూడా అందుబాటులో ఉంటుంది. పౌరుల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి పాట ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వింటూనే ఉండండి 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు!
Please do watch and share