రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలి : ఏపీసీసీ గిడుగు రుద్ర‌రాజు

దేశంలో ఆర్ధిక భ‌ద్ర‌త‌ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.రాహుల్ గాంధీకి ఇచ్చిన హక్కుల నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ సంస్ధలపై మొదటి నుంచి రాహుల్ గాంధీ గళమెత్తుతూనే ఉన్నారన్నారు. కోట్లాది రూపాయలు ఎగొట్టిన‌ వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో నెంబర్ 2 స్ధానానికి ఎలా ఎగబాకారని ఆయ‌న ప్ర‌శ్నించారు.కేంద్రం తాటాకు చప్పుళ్లకు కాంగ్రెస్ భయపడదని గిడుగు తేల్చిచెప్పారు.

కాగా సీఎం జగన్ కు రంగుల ఫోబియా పట్టుకుందని రుద్ర‌రాజు ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ సమీపంలో అంద బాలికపై అత్యాచారం, హత్య జరగడం శోచ‌నీయ‌మ‌న్నారు. ఇంత కిరాతకంగా నిందితులు వ్యవహరిస్తున్నా ప్ర‌భుత్వం చోద్యం చూస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం జ‌గ‌న్‌కు ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ఆలోచన త‌ప్ప.. లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెట్టాల‌నే సోయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఇళ్లకు జగనన్న స్టిక్కర్లు వేయడం దుర్మార్గమ‌న్న ఆయ‌న‌.. దుర్గగుడి లో పాలకమండలి సభ్యులను చూస్తుంటే బాధాకరంగా ఉందని వాపోయారు.తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చడం మంచిది కాదని గిడుగు హితువు ప‌లికారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole