రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” .  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.  గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!

కథ ; 

అర్జున్ రుద్ర(వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్(వింగ్ కమాండర్). ” ఏ జరిగిన చూసకుందాం ” అనే ధోరణిలో ఉంటాడు.  ఈక్రమంలోనే ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే ఆఫీసర్ అహనా గిల్(మానుషి చిల్లర్ )తో ప్రేమలో పడతాడు.  స్వతహాగా ఆవేశపరుడైన అర్జున్    ” ఆపరేషన్ వజ్రా ” లో ఫెయిల్ అవుతాడు.   ఈ చేధు అనుభవం నుంచి కోలుకుంటున్న సమయంలో ఆపరేషన్ వాలంటైన్  కోసం  రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆ  తర్వాత ఏ జరిగింది అన్నది మిగిలిన కథ!

ఎలా ఉందంటే..?

2019లో భారత్ పై పాక్ పుల్వామా దాడి..  ప్రతీకారంగా  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలకోట్ జరిపిన దాడులు ఆధారంగా సినిమా తెరకెక్కింది. సాధారణంగా రెండు దేశాల మధ్య పోరాటంలో  త్రివిద దళాలు పాత్ర కీలకమని చెప్పనవసరం లేదు. కానీ బాలకోట్ పై దాడి లో మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్  చూపిన తెగువ వినడమే కానీ ఎవరూ  చూసింది లేదు.   ఈమూవీలో  ఆపరేషన్ వజ్రా పేరిట గగనతలంలో ఎయిర్ ఫోర్స్  చేసిన విన్యాసాలను  చిత్రయూనిట్  చూపే ప్రయత్నం చేసింది. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు. వరుణ్ – మానుషి చిల్లర్ మధ్య ప్రేమ సన్నివేశాలు  ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ ఓకే. కథలో భాగంగా    శత్రువుల స్థావారాలను  ధ్వంసం చేసే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు . 

ఎవరెలా చేశారంటే..? 

ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పాత్రలో వరణ్ తేజ్ జీవించేశాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ మానుషి చిల్లర్ కు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. నటన పరంగా ఆకట్టుకుంది.  కీలక పాత్రలో నటించిన నవదీప్ తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతానటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.

దర్శకుడు ప్రతాప్ సింగ్ తను చెప్పాలనుకున్న కథను తెరకెక్కించడంలో కొంతమేర విజయం సాధించాడని చెప్పవచ్చు.  హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ అనిపించదు. సినిమా చూస్తుంటే అక్కడక్కడ వచ్చే సన్నివేశాలు ‘ ఫైటర్ ‘  సినిమాను గుర్తుకుతెస్తాయి. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫి సినిమాకు ఎసెట్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే..  ఆపరేషన్ “వాలంటైన్ ” మిషన్ సక్సెస్ (విజయవంతం అని చెప్పవచ్చు.

రివ్యూ రేటింగ్; 3/5( ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)

Optimized by Optimole