చెల్లి ప్రియాంకకు పెట్టిన ముద్దుకు విపరీత ప్రచారం ఇచ్చుకున్న ‘రాహుల్ భయ్యా’!
ఎదురొచ్చిన మహిళలందరికీ ‘జగనన్న’ ముద్దులు పెట్టుకుంటూ పోతే… నెహ్రూ–గాంధీ ‘రాజకుటుంబం’ కాలంతో పాటు మారదంటే మారబోదు అని మరోసారి మొన్న రుజువైంది. రాజధాని దిల్లీకి సమీపంలోని ఉత్తర్ ప్రదేశ్ నగరం బాగపత్ లో భారత్ జోడో యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన వేదికపై రాహుల్ తన వెంట ఉన్న చెల్లెలు ప్రియాంకా గాంధీ వాడ్రా భుజంపై ఎక్కడ లేని ప్రేమతో చేయి వేసి ఆమె బుగ్గను ముద్దాడారు. కాస్త ఇబ్బందిపడిన ప్రియాంక తొలి భారత కుటుంబంలోని అన్నా…
ప్రతిపక్షాలు లేకుండా చేయాలనుకున్న కేసీఆర్ కుట్రను ఛేదించాలి :టీపీసీసీ రేవంత్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారాన్ని పదిలం చేసుకోవడానికి.. కేసిఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తున్నాడని ఆరోపించారు. 2014 నుంచి సిఎం కేసిఆర్ ఇదే తరహ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని తెలిపారు. అయినప్పటికి కేసీఆర్ వైఖరిలో మాత్రం మార్పు రాలేదని..రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగిస్తునే ఉన్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక…
పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!
2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…
ఏరువాక పౌర్ణమి విశిష్టత!
ఏరువాక సాగారో రన్నో చిన్ననా… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా పడమటి దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా..!! తొలకరి పిలుపు.. రైతన్న మోము చిగురు.. పిల్ల కాలువల గెంతులాట.. పుడమి తల్లి పులకరింతకు సాక్ష్యమే ఏరువాక పౌర్ణమి. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో…
7 వ తేదీన పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం: సంకినేని
సూర్యాపేట: తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కార్యాచరణను రూపొందించిందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. పార్టీ ఆదేశానుసారం.. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందన్నారు. గురువారం సంకినేని నివాసంలో నియోజక వర్గ శక్తి కేంద్ర ఇంచార్జ్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఈనెల 7వ తేదీన త్రివేణి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ…
క్లీన్ స్వీప్ చేస్తామన్న ముఖ్యమంత్రికి అభద్రత భావం ఎందుకు: మనోహర్
ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవోపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. ప్రజల దగ్గరకు ప్రతిపక్షాలు వెళ్తే నష్టం వస్తుందని గ్రహించిన వైసీపీ ప్రభుత్వం.. జీవో 1 పేరుతో ఆంక్షలకు పూనుకుందని మండిపడ్డారు. నిరంకుశ జీవోలు తీసుకొచ్చినంత మాత్రాన ప్రజల మనసులను మార్చలేరని స్పష్టం చేశారు.175కి 175 స్థానాలు గెలుస్తామన్న సీఎం జగన్ రెడ్డికి.. అభద్రతా భావం? ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల్లో పెన్షన్ తొలగించారని.. లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఆందోళనకి…
హంగ్ దిశగా కర్ణాటక..
దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కర్ణాటకలో ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ.. హిమాచల్ సంప్రదాయం కొనసాగించాలని కాంగ్రెస్, జేడీఎస్ పట్టుదలతో ఉన్నాయి. దీంతో హోరా హోరీ త్రిముఖ పోరులో విజయం ఏ పార్టీని వరించనున్నది అంశంపై ‘ సౌత్ ఫస్ట్ న్యూస్ వెబ్ సైట్ కోసం స్థానిక రిసర్చర్ ‘ సిస్రో ‘ తో కలిసి పీపుల్స్ పల్స్ తాజాగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో హాంగ్ వచ్చే అవకాశాలున్నాయని వెల్లడయింది. మొత్తం…
సూర్యునికి ఏడు గుర్రాలేమిటి? రథమేమిటి?
సూర్యుడు ఏడు గుర్రాలపై ఉంటాడని మన శాస్త్రాలు చెప్పాయి. సూర్యుడు కదలని జ్యోతిర్మండలం కదా! సూర్యునికి ఏడు గుర్రాలేమిటి? రథమేమిటి? అసమంజసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మన ప్రాచీన శాస్త్రాల పట్ల గౌరవదృష్టి కలిగి, నిర్మలాంతఃకరణతో గమనించితే ఈ విశేషాలను తెలుసుకోగలం.సూర్యుని ‘సప్తాశ్వరథ మారూఢం’ అనే నామంతో స్తోత్రించడం ఆనవాయితీ. ఏడు గుర్రాల రథంపై సూర్యభగవానుడు ఆరోహిస్తాడని వర్ణన. రంహణశీలత్వాత్ రథః -” కదిలే లక్షణం కలది రథం. గమనం చేయడం (ప్రసరించడం) కాంతి లక్షణం. ఈ…
ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ
ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…
