BJP: బీజేపీ ‘ ఫక్తు అవకాశవాద రాజకీయ పార్టీయే’ అని నిరూపిస్తుందా..?
BjpTelangana: ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలిస్తోంది. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని అనుభవించిన పార్టీ మూడోసారి గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని చెప్పడానికి తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాలే నిదర్శనం. ‘పార్టీ విత్ యే డిఫరెన్స్’ (భిన్నమైన పార్టీ) అని ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే బీజేపీ ఇప్పుడు ‘పార్టీ ఫర్ పవర్ ఓన్లీ’ (అధికారం కోసమే పార్టీ) అన్నట్టు మారిపోయింది. తెలంగాణలో పార్టీకి ఈ జాడ్యం 2019 పార్లమెంట్ ఎన్నికల…