పంత్ జట్టు పని పూర్తి చేస్తున్నాడు: రోహిత్

జట్టు యాజమాన్యం చెప్పిన పనిని రిషబ్ పంత్ సమర్థవంతంగా పూర్తి చేస్తున్నాడని రోహిత్ శర్మ అన్నారు. రిషబ్ సత్తా ఏంటో అందరికి తెలుసని ఆయన తెలిపారు. రెండోరోజు మ్యాచ్ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనదైన శైలి బ్యాటింగ్తో ఇన్నింగ్స్ చక్కదిద్దడంపై పంత్ కు కచ్చితమైన అవగాహన ఉన్నట్లు రోహిత్ పేర్కొన్నారు. అతడు విఫలమైన ప్రతిసారీ విమర్శలు రావడం సహజమని అన్నారు. జట్టు మిిడిల్ ఆర్డర్లో ధోని లేని స్థానాన్ని పంత్ భర్తీ చేసేందుకు సిద్ధమైపోయాడని హిట్మ్యాన్ అన్నారు.