తల్లితండ్రులు-పిల్లలు ..అంతరాలను అధిగమించాలి..!

fathders day,mothers day,childrens,

Gondi kaveenderreddy: మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లితండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత తో ఉండాలి, వాళ్లను ప్రేమగా చూసుకోవాలి.

మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది. మంచి, చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో పిల్లల విషయంలో కెరియర్ విషయంలో భార్య భర్తల సంబంధాల విషయంలో నిర్ణయం అనేది తల్లితండ్రుల సలహాతో మీరు తీసుకునేదిగా ఉండాలి.

మీరు చెప్పింది మీ తల్లితండ్రులకు నచ్చకపోవొచ్చు లేదా మీరు చెప్పేది వాళ్లకు నచ్చకపోవొచ్చు ఈ పరిస్థితుల్లో మీరు సరి అయినది అనుకునే దాన్ని తల్లితండ్రులతో మాట్లాడి అర్థం అయ్యే విధంగా చెప్పి ఒప్పించండి.

లవ్ మ్యాటర్ కావొచ్చు, వరకట్న విషయం కావొచ్చు, కులాల విషయంలో కావొచ్చు, ఆర్థిక పరమైన విషయాల్లో కావొచ్చు, పెద్దలు కుదిర్చే పెళ్లి విషయంలో కావొచ్చు, పెళ్లి తరువాత కలిసి జీవించే విషయంలో కావొచ్చు, వస్త్రధారణ విషయం లో కావొచ్చు, ఇలా దేంట్లో అయినా తల్లితండ్రులకు ఇచ్చే గౌరవం విలువ ఇవ్వండి. అలాగని వాళ్ళమాటలకే కట్టుబడి ఉండకండి.

అయితే వాళ్లకు గౌరవం విలువ ఇచ్చే క్రమంలో మీ జీవితం, మీ భార్యతో మీ సంబంధాల విషయంలో, మీ భార్య జీవన విధానంలో, పుట్టింటి వాళ్ళ సంబంధాల విషయంలో, మీ ఉద్యోగ విషయంలో కంప్రమైజ్ కాకండి. తల్లితండ్రులను ఒప్పించండి కాదు అనుకుంటే మీరు అలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోండి. తల్లితండ్రుల జీవితం 75% అయిపొయింది. మీ జీవితం 25% అయిపోయి మొదలయింది, మీ నిర్ణయం అనేది తల్లితండ్రులను కొంత టైం ఇబ్బంది పెట్టినా సర్దుకుంటారు అర్థం చేసుకుంటారు. కాని మీరు తీసుకునే నిర్ణయం తేడా వస్తే మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.
తల్లితండ్రులు పిల్లల సంతోషాన్ని, వాళ్ళ బాగు కోరుకుంటారు. వాళ్లకు భయం ఉంటుంది, వాళ్ళు కొన్ని కట్టుబాట్లలో పెరిగి ఉంటారు, సమస్యలను ఎదుర్కొని ఉంటారు. అందుకే వాళ్ళు వెంటనే మీరు చెప్పే వాటికి ఒప్పుకోరు. అంత మాత్రాన వాళ్ళను పరాయివాళ్లుగా చూడవలసిన అవసరం లేదు. అలాగని అన్ని వాళ్ళు చెప్పినట్లు వినకండి.

జనరేషన్ మారుతున్నప్పుడు కచ్చితంగా మనుషుల సంబంధాల మధ్య అంతరాలు ఉంటాయి. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ప్రతి జనరేషన్ తో ఈ సమస్య వస్తుంది. వీటిని ఇద్దరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధంగా ఇద్దరు ప్రవర్తించాలి లేదంటే ఇద్దరి జీవితాల్లో సంతోషం ఉండదు అశాంతి అసంతృప్తి మిగులుతుంది.