cinima: పెద్ది గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచింది…

Gurramseetaramulu:

వర్తమాన క్రీడారంగం ఆధునిక మహాభారతం. ఇక్కడ లక్షలాది ద్రోణాచార్యులు కోట్లాది మంది ఏకలవ్యులు ఉన్నారు . నేర్పని విద్యకు బొటనవేలు కోసుకోవడం ప్రాచీన విద్య. విద్య పూర్వాపరాలు ఎరిగిన వర్తమాన ఏకలవ్యులు ఏటికి ఎదురీదటం నేర్చుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. తమని తాము చాటింపు వేసుకుంటున్నారు.

ఇప్పుడు భారతంలో బొమ్మలు తిరగబడ్డాయి. ఆధునిక ఏకలవ్యులు ఇప్పుడు ద్రోణాచార్యున్ని ప్రశ్నిస్తున్నారు.

‘ ఒరే అబ్బాయీ మేము నీకు ఎందుకు బొటనవేలు ఇవ్వాలిరా ? . మా తాతలు ముత్తాతలు ఈ భూమికి మూలవాసులు, విలు విద్య మేము ఒకరిదగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు బహుశా ఈ అడవిలో మీ పూర్వీకులే (ద్రోణాచార్య) మా దగ్గర విలువిద్య నేర్చుకుని ఉంటారు. ఇక బొటనవేలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటోంది వర్తమాన చైతన్యం.

కానీ తెలుగు సినిమా బొటన వేలే కాదు అడిగినా అడగకున్నా తొడకాదు మెడ అయినా కోసుకుంటాం అంటున్నారు.

సానా బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా చూశాక ఆధునిక ద్రోణులు బుచ్చిబాబు రూపంలో ఉంటారు లే అనిపించింది. ఈ బుచ్చిబాబు నాలుగేళ్ల కింద ‘ఉప్పెన’ అనే సినిమా తీశాడు. హిల్లరీ జోర్డాన్ అనే అమెరికా అమ్మాయి కొలంబియా లో సృజనాత్మక సాహిత్యం చదువుకొని నేటికి సరిగ్గా పదిహేడు ఏళ్ళ కింద ‘మడ్ బాండ్’ అనే నవల రాసుకుంది. డెబ్బై ఎనభై ఏళ్ళ కింద మిస్సిసిపి డెల్టా పత్తి క్షేత్రంలో అమానవీయమైన జాతివివక్ష నేపథ్యం లో రెండు విభిన్నమైన జాతుల మధ్య జరిగిన ఒక అంతర్యుద్దం కథ. ఈ కథను చక్కగా కాపీ కొట్టాడు . ఆ కథ ‘మడ్ బాండ్’ పేరుతో Netflix లో చూడొచ్చు.

ఇక పోతే పెద్ది సినిమా కథ మంచిదే, నటుడు సమర్ధుడు. ఏకాడికి ఆ సమర్ధతను మరింత పెద్దగా తీయాలి అనే ఆశ పెద్ది ని వెన్నెముక లేని కథ గా మార్చింది. కధనం పరమ జుగుప్స . అన్నిటికన్నా హీరోయిన్ అనేవాళ్లూ వాళ్ళు వీళ్ళకు ఆటబొమ్మలు. తెలుగు సమాజం ఆట కూలీని సహిస్తాదే మో గానీ ఆడపిల్లను ఆట బొమ్మగా చూపడం తప్పు అనే మాట అనలేక పోతోంది. పాపం శ్రీదేవి బిడ్డ.

ఇక కథ లోకి వెళితే ఒక్కటే నాకు నచ్చిన అంశం కొండ జనాలకీ (అ)నాగరిక జనాలకీ మధ్య ఆఘాతంలా పేరుకుని పోయిన దూరాన్ని తగ్గించడం, దానికోసం శ్రీకాకుళ పోరాట అప్పలస్వామి అవసరం వచ్చింది. కానీ వూరు ఉనికీ అస్తిత్వం లేని ఆ కొండ జనాల దగ్గర ఓటుకోశం వచ్చిన కథ అదే జనం తమకు కనీస గుర్తింపు కార్డు లేదు అని పోరాడడం ఈ రెండు వైరుధ్యాలు మోకాలి లో మెదడు ఉన్న సానా బుచ్చిబాబు ఒక్కడే తియ్యగలడు, తెలుగు అలగా జనం మాత్రమే చూడగలరు.

దేశానికి నాగరిక సమాజానికి దూరంగా బ్రతుకుతున్న ఒక కూలీ కొండ నా కొడుకు తన ఉనికి అస్తిత్వం కాపాడుకోవడం కోసం తనకు వచ్చిన అన్ని ఆటలూ ఆడేసి మన అందరికీ మిక్సర్ పొట్లం అందించాడు. ఆట ద్వారానే తనకొక అస్తిత్వం ఉంది అనే ఎరక కలిగాక మర మనిషిలా అన్ని ఆటలూ ఆడడం మొదలు పెట్టి చివరకి తానే ఒక వికలాంగుడి గా అవతారం ఎత్తి పారా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు ఈ కథను ఒలింపిక్ పానెల్ లో ఉన్నవాడికే చెప్పి అందరినీ ఫూల్స్ ని చేశాడు.

ఒక పల్లెటూరి వాడు ఒలింపిక్ సెలె క్షన్ బోర్డ్ మెంబర్ కి ఒలింపిక్స్ లో పథకం పొందిన వాడి గురించి చెప్పడం అంతా కామెడీ ఇంకొకటి లేదు ఇలాంటి అసత్యాలు, అబద్దాలు కేవలం తెలుగు తెర మీదనే చూడగలం దానికి కారణం తెలుగు సినిమా దర్శకులను నిర్మాతలు హీరోలు శాసిస్తున్నారు. వాళ్ళను వెన్నెముక లేని బొద్దింకల లాగా తయారు చేశారు.

ఒక కల్పిత గాథను సృస్టి0చి ఒక కృత్రిమ ఒలింపిక్ సంగాన్ని పెట్టి వాడికి తెలియకుండానే ఒలింపిక్ పథకం ఎలా పొందాడొ చెప్పడం చూస్తే చూసేవాడు అయినా తీసిన వాడు అయినా ప్రేక్షకులను వెర్రి పుష్పాలను చేయడమే దర్శకుడి ప్రతిభ

ఇంతకు పెద్ది అనే క్రీడాకారుడు కులం మూలంగా లేదా ప్రాంతం మూలంగా లేదా ఆర్ధిక వెనకబాటు తనం కు మూలంగా వెనకబడ్డాడా అని చెప్పే సాహసం చేయలేక పోయాడు. ఎందుకంటే తెలుగు తెరకు కులం అంటరానిది. అది కొన్ని ఉద్దారక కులాలకు మాత్రమే అంటదగినది.

అసలు కథ ఏమిటి కథకు అనుగుణంగా హీరో ఎలా ఉండాలి అనే చర్చ ఇక్కడ ఉండదు. మా హీరో అవతార పురుషుడు వెయ్యిమందిని ఒక్క కత్తి వేటుతో నరకగలడు అనిచెప్పడమే . పచ్చిగా మాట్లాడుకుంటే ఏపాటి అవగాహన లేని మనుషులు దర్శకులుగా తెలుగు తెరను యేలుతున్నారు

వాళ్ళకు కొద్ది పాటి కాల స్పృహ ఉండదు. బూత, వర్తమానాలు కలిపి భవిష్యత్తు లో కాకటైల్ లాగా తాగగలరు. మార్లిన్ మన్రో ను జబర్దస్త్ శకలక శంకర్ తో రొమాన్స్ చేపించ గల తెంపరితనం తెలుగు తెర మీదనే చూడగలం.

తెలుగు సినిమా కు కొత్తగా జాతి, సనాతన ధర్మం అంటుకుంది. ఇక ఆరు పూలు అరవై ఆరు గెటప్ లతో వర్దీల్లే కాలం దరి దాపులోనే ఉంది కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అందాకా పెద్ది సినిమాకు వచ్చిన ఆదాయం లెక్కలు వేసుకుందాం.

Optimized by Optimole