Nalgonda: జిల్లా ఎస్.పి అపూర్వ రావు డిండి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల పని తీరు గురించి స్టేషన్ ఎస్. ఐ… ఎస్పీకి వివరించారు. అనంతరం స్టేషన్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపుర్యకంగా నడుచుకోవాలని.. వారి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లా పోలీస్ వ్యవస్థ.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని.. డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర రావు, సిఐ పరశరాం ఎస్.ఐ, సిబ్బంది పాల్గొన్నారు.
